సందీప్‌ కిషన్‌ 'మాయవన్‌' లుక్‌ విడుదల!

సందీప్‌ కిషన్‌ 'మాయవన్‌' లుక్‌ విడుదల!

1 month ago | 27 Views

హీరో సందీప్‌ కిషన్‌ , క్రియేటివ్‌ డైరెక్టర్‌ సి.వి కుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన సెన్సేషనల్‌ హిట్‌ ప్రాజెక్ట్‌ జెడ్‌ తర్వాత సెకండ్‌ పార్ట్‌ కోసం మరోసారి చేతులు కలిపారు. 'మాయవన్‌' అనే టైటిల్‌ తో రూపొందుతున్న ఈ సీక్వెల్‌ ను ఎకె ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ బ్యానర్‌ పై రాంబ్రహ్మం సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపధ్యంలో రూపొందే ఈ చిత్రాన్ని అడ్వెంచర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సమర్పిస్తోంది. కిషోర్‌ గరికిపాటి (జికె) ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత. సందీప్‌ కిషన్‌  బర్త్‌ డే సందర్భంగా మేకర్స్‌ పవర్‌ ప్యాక్డ్‌ ఫస్ట్‌ లుక్‌ ని విడుదల చేశారు. సందీప్‌ కిషన్‌ ఒక పిడికిలిని బిగించి మరో చేతిలో సూపర్‌ పవర్‌ వెపన్‌ తో ఇంటెన్స్‌ గా చూస్తున్న ఫస్ట్‌ లుక్‌ మైండ్‌ బ్లోయింగ్‌ గా వుంది.

ఈ ఎక్సయిటింగ్‌ ఫస్ట్‌ లుక్‌ సినిమాపై చాలా క్యూరియాసిటినీ పెంచింది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు, సాహో ఫేమ్‌ నీల్‌ నితిన్‌ ముఖేష్‌ను కీలక పాత్రలో నటిస్తున్నారు. సందీప్‌ కిషన్‌ సరసన ఆకాంక్ష రంజన్‌ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. టాప్‌ క్లాస్‌ ప్రొడక్షన్‌, టెక్నికల్‌ స్టాండర్డ్స్‌తో హై బ్జడెట్‌తో రూపొందనున్న ఈ చిత్రం, సూపర్‌విలన్‌తో ఒక సామాన్యుడి ఘర్షణ కథగా ఉండబోతుంది. ఈ చిత్రానికి కార్తీక్‌ తిల్లై / కవిన్‌ రాజ్‌ డీవోపీలుగా పని చేస్తుండగా, సెన్సేషనల్‌ కంపోజర్‌ సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు.

ఇంకా చదవండి: కొడుకుతో కలసి బ్రహ్మానందం కొత్త సినిమా ... బ్రహ్మా ఆనందం టైటిల్‌ ఖరారు!!

# Maayavan     # SundeepKishan     # AksharaGowda     # TeluguCinema