నిఖిల్‌ సరసన సంయుక్త!

నిఖిల్‌ సరసన సంయుక్త!

1 month ago | 24 Views

సినిమా సినిమాకు కొత్తదనంతో కూడిన కథలను ఎంపిక చేసుకుంటూ హిట్స్‌ను ఖాతాలో వేసుకుంటు న్నాడు టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్దార్థ. ఈ యంగ్‌ యాక్టర్‌ తొలిసారి నటిస్తోన్న పాన్‌ ఇండియా చిత్రం 'స్వయంభు'. ఈ మూవీలో మలయాళ బ్యూటీ సంయుక్త  ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. కాగా ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్‌ చేసిన ఫస్ట్‌ లుక్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. తాజాగా చాలా రోజుల తర్వాత షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమా గురించి ఆసక్తికర అప్‌డేట్‌ అందించింది నిఖిల్‌ అండ్‌ మేకర్స్‌ టీం. 'స్వయంభు' టీం.. ఒక పురాతన కాలం బ్యాక్‌డ్రాప్‌లో సాగే యుద్ధ ఎపిసోడ్‌ను భారీ స్థాయిలో చిత్రీకరిస్తోంది. 12 రోజులపాటు జరుగనున్న ఈ షెడ్యూల్‌ను రూ.8 కోట్ల భారీ బ్జడెట్‌తో షూట్‌ చేస్తున్నారు.

నిఖిల్‌ యాక్షన్‌, స్టంట్స్‌తో సాగే ఈ సీక్వెన్స్‌ అద్భుతంగా ఉండబోతుందని మేకర్స్‌ ట్వీట్‌ చేశారు. తాజా అప్‌డేట్‌తో సినిమా స్టన్నింగ్‌గా గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఉండబోతుందని అర్థమవుతోంది. 'స్వయంభు' చిత్రానికి భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ నిఖీల్‌ కెరీర్‌లో అత్యంత భారీ బ్జడెట్‌తో వస్తోంది. ఠాగూర్‌ మధు సమర్పణలో పిక్సెల్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై భువన్‌, శ్రీకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి మనోజ్‌ పరమహంస సినిమాటోగ్రాఫర్‌.. కాగా కేజీఎఫ్‌ ఫేం రవి బస్రూర్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, సంగీతం అందిస్తున్నాడు. స్వయంభులో నిఖిల్‌ యుద్ధ వీరుడిగా ఇదివరకెన్నడూ కనిపించని సర్‌ప్రైజింగ్‌ లుక్‌లో మెరువబోతున్నాడు.

ఇంకా చదవండి: సందీప్‌ కిషన్‌ 'మాయవన్‌' లుక్‌ విడుదల!

# Swayambhu     # SamyukthaMenon     # NikhilSiddhartha     # TeluguCinema