ఫీమేల్ లీడ్ రోల్‌గా సంయుక్త మూవీ
2 months ago | 5 Views
'భీమ్లా నాయక్’ సినిమాలో పవన్ కళ్యాణ్, నిత్యా విూనన్ ఒక జంటగా నటిస్తే.. మరో జంటగా రానా దగ్గుబాటి, సంయుక్త నటించారు. ఈ సినిమాలో నిత్యావిూనన్ పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అంతే ప్రాముఖ్యత సంయుక్త పాత్రకు కూడా ఉంటుంది. ఆ పాత్రలు వారిద్దరికీ మంచి పేరునే తెచ్చిపెట్టాయి. ఇక ఇప్పటి వరకు హీరోల పక్కన నటిస్తూ సక్సెస్ అందుకుంటున్న సంయుక్త తొలిసారి ఫిమేల్ సెంట్రిక్ యాక్షన్ థ్రిల్లర్‌తో తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఆమె ప్రధాన పాత్రలో నటించబోతున్న చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమవగా.. ఈ సినిమాకు క్లాప్‌ను 'భీమ్లా నాయక్’లో తనకు భర్తగా నటించిన రానా దగ్గుబాటి కొట్టారు.
ఈ సినిమా వరుస బ్లాక్‌బస్టర్స్ సినిమాలతో అలరిస్తున్న టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త తొలిసారిగా ఫీమేల్ సెంట్రిక్ మూవీ చేస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి సెన్సేషనల్ హిట్ చిత్రాలను అందించిన సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండా నిర్మించనున్న ఈ చిత్రానికి యోగేష్ కెఎంసి దర్శకుడు. మాగంటి పిక్చర్స్‌తో కలిసి హాస్య మూవీస్ ప్రొడక్షన్ నంబర్ 6గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సంయుక్తనే సమర్పిస్తోంది. బుధవారం రామానాయుడు స్టూడియోస్‌లో పలువురు ప్రత్యేక అతిథుల సమక్షంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది.
ఇంకా చదవండి: ‘వేట్టయన్ ది హంటర్’ టైటిల్‌పై ప్రముఖ నిర్మాత సురేష్, దిల్ రాజు, పాన్ ఇండియన్ యాక్టర్ రానా దగ్గుబాటి వివరణ