ప్రియదర్శితో సమంత మూవీ..

ప్రియదర్శితో సమంత మూవీ..

6 months ago | 5 Views

స్టార్‌ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మయోసైటిస్‌ కారణంగా కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె ప్రస్తుతం మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ప్రస్తుతం సెలెక్టివ్‌ గా సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌లు చేసుకుంటూ వెళ్తోంది. తాజాగా ఆమె నటిస్తున్న 'సిటాడెల్‌: హనీ బన్నీ' వెబ్‌ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. ఇదిలా ఉండగా, ఆమె సెలెక్టివ్‌ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది. ఆమె చివరి చిత్రం విజయ్‌ దేవరకొండతో తీసిన 'ఖుషి' సినిమా. ఇది బాక్సాపీసు వద్ద యావరేజ్‌ గా నిలిచింది. తన సొంత ప్రొడక్షన్‌ హౌస్‌ ట్రలాల మూవీంగ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై తనే లీడ్‌ క్యారెక్టర్‌ లో  'మా ఇంటి బంగారం’ అనే సినిమాను ప్రకటించింది.


తాజాగా మరో సినిమాను నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటించబోతుందట. అయితే, ఈ సినిమాలో ఆమె టాలెంటెడ్‌ యాక్టర్‌ ప్రియదర్శితో రొమాన్స్‌ చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రియదర్శితో సమంత జోడీ కట్టనుందన్న వార్త ప్రస్తుతం అభిమానుల్లో క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తుంది. ఇక సమంత పలు చిన్న సినిమాలను తన సొంత బ్యానర్‌పై నిర్మించేందుకు సిద్ధమవుతోంది. మరి ప్రియదర్శి-సమంత కాంబినేషన్‌లో నిజంగానే సినిమా వస్తుందా లేదా? అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు చూడాల్సిందే.

ఇంకా చదవండి: టెంపుల్‌ ట్రెజరీ ఆధారంగా 'నాగబంధం'

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# MaaIntiBangaram     # SamanthaRuthPrabhu     # Priyadarshi