'బేబీజాన్‌' షూట్‌లో పాల్గొననున్న సల్మాన్‌!

'బేబీజాన్‌' షూట్‌లో పాల్గొననున్న సల్మాన్‌!

2 months ago | 5 Views

బాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ సల్మాన్‌ ఖాన్‌లో బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేస్తున్నాడని తెలిసిందే. ఓ వైపు లీడ్‌ యాక్టర్‌గా చేస్తూనే.. మరోవైపు కామియో రోల్‌లో కూడా కనిపించబోతున్నాడు. ఈ స్టార్‌ యాక్టర్‌ గెస్ట్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం బేబీ జాన్‌  నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ బాలీవుడ్‌ డెబ్యూ ప్రాజెక్ట్‌ వరుణ్‌ ధావన్  లీడ్‌ రోల్‌లో నటిస్తున్నాడు. సల్మాన్‌ ఖాన్‌ ఈ మూవీ షూట్‌లో ఎప్పుడు జాయిన్‌ అవుతాడనే దానిపై ఆసక్తికర అప్‌డేట్‌ బయటకు వచ్చింది. తాజా టాక్‌ ప్రకారం ఈ నెల  మొదటి వారంలో బేబిజాన్‌ చిత్రీకరణలో జాయిన్‌ కాబోతున్నాడు. ఈ షెడ్యూల్‌లో  వరుణ్‌ ధావన్ , సల్మాన్‌ ఖాన్‌పై వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌ను షూట్‌ చేయబోతున్నారట. ఈ సినిమాను డిసెంబర్‌ 25న ప్రపంచవాప్తంగా క్రిస్మస్‌ కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్‌. ఈ చిత్రంలో వామికా గబ్బి మరో హీరోయిన్‌గా నటిస్తోంది. బేబిజాన్‌ నుంచి ఇప్పటికే లాంఛ్‌ చేసిన ఫస్ట్‌ లుక్‌ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ మూవీకి థమన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సినీ1 స్టూడియోస్‌, జియో స్టూడియోస్‌తో కలిసి ప్రియాఅట్లీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.

ఇంకా చదవండి: నిలకడగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఆరోగ్యం!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# BabyJohn     # SalmanKhan    

trending

View More