కొత్త సినిమాను ప్రారంభించిన సాయిదుర్గా తేజ్‌!

కొత్త సినిమాను ప్రారంభించిన సాయిదుర్గా తేజ్‌!

2 months ago | 5 Views

వైవిధ్యమైన కథలు ఎంచుకునే హీరోల్లో సాయి దుర్గా తేజ్‌ ఒకరు. 'విరూపాక్ష’, 'బ్రో’ తర్వాత ఇప్పుడు మరో ఆసక్తికరమైన కథతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఈ యంగ్‌ హీరో పుట్టినరోజు సందర్భంగా మంగళవారం కొత్త సినిమాను ప్రకటించారు. 'ఎస్‌డిటి18' వర్కింగ్‌ టైటిల్‌తో ఇది తెరకెక్కనుంది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం ఓ మేకింగ్‌ వీడియోను విడుదల చేసింది.


'హనుమాన్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను నిర్మించిన కె.  నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో రోహిత్‌ కేపీ దర్శకుడిగా పరిచయం కానున్నారు. 'ధైర్యాన్నే తన కవచంగా, ఆశనే ఆయుధంగా చేసుకున్న ఈ వ్యక్తి అందరికోసం నిలబడతాడు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే’ అనే క్యాప్షన్‌తో ఓ వీడియోను విడుదల చేస్తూ చిత్రబృందం సాయి దుర్గా తేజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.

ఇంకా చదవండి: ఇడ్లీ కొట్టుతో వస్తోన్న నిత్యావిూనన్‌

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# SDT18     # SaidurgaTej     # NiranjanReddy    

trending

View More