వెట్రిమారన్‌ సినిమాలో రుహానీ శర్మ!

వెట్రిమారన్‌ సినిమాలో రుహానీ శర్మ!

2 days ago | 12 Views

రీసెంట్‌ గా స్టార్‌ అనే తమిళ సినిమాతో హిట్‌ కొట్టిన కెవిన్‌ తాజాగా నటిస్తున్న చిత్రం 'మాస్క్‌’ . దిగ్గజ దర్శకుడు వెట్రిమారన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆండ్రియా నెగెటివ్‌ రోల్‌లో కీలక పాత్ర పోషిస్తుండగా. హీరోయిన్‌గా రుహానీ శర్మ ను ఎంపిక చేశారు. ఈ చిత్రం ద్వారా విక్రమన్‌ అశోక్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాల్లో బిజీగా ఉన్న రుహానీ శర్మ  ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్‌ విూడియాలో ఓ పోస్టు చేసింది. నేను తమిళ పరిశ్రమలో అడుగు పెట్టడానికి ఇలాంటి మంచి చిత్రంలో అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొంది. తొలి చిత్రమే వెట్రీమారన్‌ వంటి దర్శకుడి చిత్రంలో చేయడం కలలా ఉందని తెలిపింది. ఈ సందర్భంగా షూటింగ్‌ స్పాట్  ఫొటోలను షేర్‌ చేసింది. రుహానీ శర్మ .. తెలుగునాట ఇప్పుడు ఎక్కువగా సినిమాలు చేస్తున్న నటి ఈ ముద్దుగుమ్మనే.

సుశాంత్‌ హీరోగా వచ్చిన 'చిలసౌ' చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ హిమాచల్‌ సుందరి ఆ తర్వాత హిట్‌ , నూటొక్క జిల్లాల అందగాడు, హర్‌, డర్టీ హరి వంటి చిత్రాలతో పాటు సంక్రాంతికి విడుదలైన సైంథవ్‌, ఆపరేషన్‌ వాలంటైన్‌  చిత్రాలలోను నటించింది. గ్లామర్‌ విషయంలో ఎలాంటి మోహమాటం లేని ఈ అమ్మడు హీరోయిన్‌ గానే చేస్తా అని మడి కట్టుకొని కూర్చోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళ్తోన్న ఈ చిన్నది ప్రస్తుతం తెలుగులో బిజీ అర్టిస్ట్‌గా మారింది. ఆమె హీరోయిన్‌గా నటించిన శ్రీరంగనీతులు,మరో నాలుగైదు చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు లైన్‌లో పెట్టింది. ఇక తను చేసే పాత్రల్లో అవసరమైతే అంతకుమించి అనేలా అంగంగా ప్రదర్శనలు, ఇంటిమేట్‌ సన్నివేశాలలోనూ ఎలాంటి జంకు లేకుండా నటించండం ఈ అమ్మడి ప్రత్యేకత. ఇప్పటికే తన గ్లామర్‌ షోతో, బోల్డ్‌ యాక్టింగ్‌తో తనకంటూ సపరేటు అభిమాన వర్గాన్ని సంపాదించుకున్న రుహనీ సోషల్‌ విూడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం తను పాల్గొనే ఫొటో షూట్లతో పాటు, విహారయాత్రల ఫొటోలను, షేర్‌ చేస్తూ కుర్రకారుకు నిద్రను దూరం చేస్తోంది.

ఇంకా చదవండి: ఘనంగా హీరో వరుణ్ సందేశ్ "విరాజి" మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్

# Vetrimaaran     # RuhaniSharma     # Socialmedia     # TeluguCinema