నవంబరు 28న

నవంబరు 28న "రోటి కపడా రొమాన్స్‌" గ్రాండ్‌ విడుదల..

1 month ago | 5 Views

హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు.  తొలుత ఈ చిత్రాన్ని నవంబరు 22న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి అన్ని సన్నాహాలు చేసుకున్నారు మేకర్స్‌. అయితే ఓ మంచి చిత్రం చిత్రం అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్‌ చేయాలనే సంకల్పంతో,  థియేటర్స్‌ దొరకని కారణంగా చిత్రాన్ని ఈ నెల 28న మాసివ్‌ గ్రాండ్‌ రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్నారు నిర్మాతలు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ''యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా, నేటి యూత్‌ను ఆకట్టుకునే అంశాలుతో రూపొందిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేస్తున్నాం.

Roti Kapda Romance (2024) - Movie | Reviews, Cast & Release Date -  BookMyShow

ఈ నెల 22 నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాల్లో పెయిడ్‌ ప్రీమియర్స్‌ ప్లాన్‌ చేస్తున్నాం. ఇటీవల కొంత మంది సగటు ప్రేక్షకులకు, యూత్‌కు సినిమాను ప్రదర్శించాం. అందరికి నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. బుధవారం మీడియాకు వేసిన షోకు కూడా మంచి స్పందన వస్తోంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీని చూడలేదు అని వాళ్లు ప్రశంసిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఓ మంచి చిత్రం అందరికి చేరువ కావాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని ఈ నెల 28న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం. ముఖ్యంగా ఆల్‌రెడీ ఈ చిత్రానికి క్రిటిక్స్‌ నుండి మంచి రివ్యూలు వస్తున్నాయి. దీంతో మా చిత్ర విజయంపై మరింత నమ్మకం పెరిగింది. తప్పకుండా ఈ చిత్రం 2024లో విడుదలైన చిత్రాల్లో ఉత్తమ ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీగా నిలుస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు.

ఇంకా చదవండి: రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# రోటికపడారొమాన్స్‌     # హర్షనర్రా     # సందీప్సరోజ్    

trending

View More