2న 'గబ్బర్‌ సింగ్‌' రీరిలీజ్‌.. ఆనాటి విశేషాలు పంచుకున్న హరీష్‌ శంకర్‌-బండ్ల!

2న 'గబ్బర్‌ సింగ్‌' రీరిలీజ్‌.. ఆనాటి విశేషాలు పంచుకున్న హరీష్‌ శంకర్‌-బండ్ల!

2 months ago | 29 Views

పవన్‌ కల్యాణ్‌ - హరీశ్‌ శంకర్‌ కాంబోలో వచ్చిన సూపర్‌హిట్‌ మూవీ 'గబ్బర్‌ సింగ్‌’ 2012లో విడుదలై  పవన్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా ఈ చిత్రం మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. పవన్‌ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్‌ 2న 'గబ్బర్‌ సింగ్‌’ రీ-రిలీజ్‌ కానుంది. ఈనేపథ్యంలో దర్శకుడు హరీశ్‌ శంకర్‌, చిత్ర నిర్మాత బండ్ల గణేశ్‌  విూడియాతో ముచ్చటించారు.'సోషల్‌విూడియా విస్తృతంగా వ్యాప్తి చెందిన ఈ రోజుల్లో 'గబ్బర్‌సింగ్‌’  రిలీజ్‌.. అయి ఉంటే ఎంత బాగుండేదో అని నా మనసులో ఎప్పటినుంచో ఒక చిన్న వెలితి ఉండేది. ఆ వెలితి ఇప్పుడు తీరింది. నాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిన ఈ టీమ్‌కు ధన్యవాదాలు. 'గబ్బర్‌ సింగ్‌’ అంటేనే ఒక చరిత్ర. అందులో ఎలాంటి సందేహం లేదు. మా జీవితాలను మార్చేసిన చిత్రమిది. ఈ సినిమా మేము ఊహించిన దానికంటే భారీ విజయాన్ని అందుకుంది. ఎక్కడికి వెళ్లినా అభిమానాన్ని చూపించారు. ఈ సక్సెస్‌ అందరికంటే బలంగా కోరుకున్న వ్యక్తి బండ్ల గణేశ్‌. ఈ సినిమా సక్సెస్‌ ఊహించిన తొలి వ్యక్తి పవన్‌కల్యాణ్‌.

డబ్బింగ్‌ సమయంలోనే ఆయన ఇది పక్కా బ్లాక్‌బస్టర్‌ అన్నారు. ఇది ఎవర్‌గ్రీన్‌ మూవీ‘ అని హరీశ్‌ శంకర్‌ తెలిపారు. 'నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే. పవన్‌కల్యాణ్‌ నాకు బతుకునిచ్చారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను ఆర్థికంగా ఏ స్థాయికి వెళ్లినా పవన్‌ లేకపోతే ఈ పేరు, క్రేజ్‌ ఉండేది కాదు. 'చింతకాయల రవి’ నుంచి నాకు హరీశ్‌తో సత్సంబంధాలు ఉండేవి. ఒకరోజు పవన్‌ నన్ను పిలిచి.. ’నేను సినిమా చేస్తా. నువ్వు నిర్మాతగా ఉంటావా అని అడిగారు’. నన్ను నిర్మాతగా చేసిన ఆయనకు పాదాభివందనం. 'గబ్బర్‌సింగ్‌’ ఒక చరిత్ర. పవన్‌కల్యాణ్‌ అభిమానులకు ఈ సినిమా ఎంతో ప్రత్యేకమైనది. ఆయనతో 'తీన్‌మార్‌’ చేశా. పవన్‌ గొప్ప మానవత్వం, నిజాయతీ, నిబద్ధత కలిగిన వ్యక్తి. నీతి పరుడు. దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకుని, సంతోషంగా జీవితాన్ని కొనసాగించే నటుడు పవన్‌కల్యాణ్‌. జనం కోసం తన కుటుంబాన్ని వదిలేసి పోరాడుతున్నారు. దాదాపు 10ఏళ్లు ప్రజల కోసం పోరాడి ఈ రోజు ఒక స్థాయికి వచ్చారు. పవన్‌తో 'గబ్బర్‌సింగ్‌' చేయడం నా అదృష్టం. రీ రిలీజ్‌కు  ఏడాది  నుంచే ప్లాన్‌ చేస్తున్నా. గుజరాత్‌లో షూట్‌ చేస్తున్నప్పుడు పవన్‌ గుర్రంపై నుంచి కిందపడ్డారు. ఆరోజు నాకు గుండె ఆగిపోయింది. షూట్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. దర్శకుడు ఏం చెబితే ఆయన చేశారు. రీ రిలీజ్‌ టికెట్లు కోసం చాలామంది ఫోన్లు చేస్తున్నారు. తెలుగు సినీ రంగానికి ప్రపంచవ్యప్తంగా గుర్తింపు వస్తున్న రోజులివి. దాదాపు ఏడేళ్ల నుంచి సినిమాలు నిర్మించకుండా ఉన్నందుకు బాధపడుతున్నా. ఇకపై బ్లాక్‌బస్టర్‌ సినిమాలు చేస్తా.  సినిమాల్లో పుట్టా. సినిమాల్లోనే ఉంటా.  సినిమానే నా వ్యాపకం, ఆశ, జీవితం. పరమేశ్వర ఆర్ట్స్‌ బండ్లగణేశ్‌ అంటే ఏంటో చూపించేందుకు బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు నిర్మిస్తా. అదే సంకల్పంగా ముందుకు సాగుతా‘ అని బండ్ల గణేశ్‌ అన్నారు.  సినిమా సక్సెస్‌ను ఊహించిన వ్యక్తి పవన్‌కల్యాణ్‌ గారు. మరో పుష్కర కాలం తర్వాత వచ్చినా ఈ సినిమా ట్రెండ్‌ ఇలాగే ఉంటుంది‘ అని అన్నారు.

ఇంకా చదవండి: అశ్వత్థామ పాత్రలో అమితాబ్‌ కు డూప్‌గా ఏడడుగుల సునీల్‌ కుమార్‌!

# HarishShankar     # PawanKalyan     # GabbarSingh    

trending

View More