'కన్నప్ప' నుంచి మరి కొన్ని పాత్రల విడుదల!
4 months ago | 35 Views
మంచు విష్ణు ’కన్నప్ప’ నుంచి మరో పాత్రను రివీల్ చేసిన మేకర్స్. బాలీవుడ్ నటుడు ముఖేష్ రిషి కంపడు అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలిపింది. ఈ సినిమాకు సంబంధించి ఒక్కొక్క క్యారెక్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తమిళ నటుడు శరత్ కుమార్ నాథనాధుడు అనే పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించిన కన్నప్ప టీం ఆ తర్వాత సినీయర్ నటి మధుబాల ’పన్నగ’ అనే చెంచుల దొరసాని పాత్రలో కనిపించబోతుందని.. తెలుగు సినీయర్ నటుడు దేవరాజ్ ’ముండడు’ అనే ఎరుకల దొరపాత్రలో నటుడు సంపత్ రామ్ భిల్లు జాతి దొర చండుడు అనే పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు తాజాగా మరో పాత్రను విడుదల చేసింది కన్నప్ప టీం.
ఈ సినిమాలో సీనియర్ నటుడు ముఖేష్ రిషి కంపడు అనే పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించింది. పుళిందులు అత్యంత పురాతనమైన జాతి, సదాశివ కొండల్లో నివసిస్తుంటారు. వంశ పారంపర్యంగా ? పవిత్రమైన వాయు లింగాన్ని సంరక్షిస్తున్న ఈ పుళింద జాతిని భద్ర గణం అంటారు. భద్ర గణాన్ని నడిపించే నాయకుడే కంపడు అంటూ ముఖేష్ రిషి పోస్టర్‌ను విడుదల చేసింది. ఇతనితో పాటు టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ గవ్వరాజు అనే పాత్రలో నటిస్తున్నట్లు పోస్టర్‌ను విడుదల చేసింది. మంచు ఫ్యామిలీ నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప. దాదాపు రూ.100 కోట్ల బ్జడెట్‌తో వస్తున్న ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తుండగా.. మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్నాడు. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ అగ్ర తారలు నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇంకా చదవండి: 'బ్రహ్మ ఆనందం' గ్లింప్స్ విడుదల
# Kannappa # VishnuManchu # MohanBabu