"లవ్ రెడ్డి" చిత్రానికి సపోర్ట్ గా నిలిచిన రెబెల్ స్టార్ ప్రభాస్, ఆనందం వ్యక్తం చేసిన చిత్ర బృందం
2 months ago | 5 Views
చిన్న చిత్రాలకు తమ వంతు బాధ్యతగా మద్దతు ఇచ్చేందుకు పెద్ద హీరోలు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. లవ్ రెడ్డి చిత్రాన్ని ప్రొత్సహిస్తూ ఇన్ స్టా వేదికగా తన మద్దతు ప్రకటించారు. లవ్ రెడ్డి చిత్రానికి సంబంధించి ఎన్నో మంచి విషయాలు తన దృష్టికి వచ్చాయని, ఇటీవల కాలంలో విడుదలైన ప్రేమ కథల్లో లవ్ రెడ్డి మంచి చిత్రంగా నిలువడం ఆనందంగా ఉందని ప్రభాస్ తెలిపారు. ఈ మేరకు ఇన్ స్టాలో తన అభిమానుల కోసం లవ్ రెడ్డి ట్రైలర్ ను షేర్ చేస్తూ ఆ చిత్రానికి అండంగా నిలువాలని ప్రభాస్ కోరారు. ఇప్పటికే ఈ చిత్రానికి యువ నటుడు కిరణ్ అబ్బవరం ముందుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో 4 స్పాన్సర్ షోలు వేసి మద్దతు ఇవ్వగా ప్రభాస్ లాంటి అగ్ర హీరో లవ్ రెడ్డి చిత్రానికి అండగా నిలువడం పట్ల చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. ప్రభాస్ లవ్ రెడ్డి చిత్రానికి మద్దతుగా నిలువడం పట్ల సామాజిక మాద్యమాల్లో నెటింజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. లవ్ రెడ్డి చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు
గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం "లవ్ రెడ్డి" . అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటించారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమకథగా నూతన దర్శకుడు స్మరన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రొడ్యూసర్స్ సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి "లవ్ రెడ్డి" చిత్రాన్ని నిర్మించారు. సుమ, సుస్మిత, హరీష్, బాబు, రవి కిరణ్, జకరియా సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా "లవ్ రెడ్డి" సినిమా ఈ నెల 18వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
నటీనటులు - అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి, తదితరులు
టెక్నికల్ టీమ్
సంగీతం - ప్రిన్స్ హేన్రి
ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - రవీంద్ర రెడ్డి
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా(సురేష్ - శ్రీనివాస్)
సహా నిర్మాతలు - సుమ, సుస్మిత, హరీష్, బాబు, రవి కిరణ్, జకరియా
నిర్మాతలు- సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి
రచన, దర్శకత్వం: స్మరన్ రెడ్డి
ఇంకా చదవండి: మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్.. 'అమరన్’లో శికార్తికేయన్, సాయిపల్లవి జంట!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!