తిరుమల కిషోర్ దర్శకత్వంలో రవితేజ!
4 months ago | 37 Views
రవితేజ నటించిన 'మిస్టర్ బచ్చన్’ సినిమా ఈ ఆగస్టు 15న విడుదలకి సిద్ధం అవుతోంది. హరీష్ శంకర్ దర్శకుడు, ఈ సినిమా అజయ్ దేవగన్ నటించిన హిందీ సినిమా ’ది రైడ్’ సినిమాకి అనువాదం. ఈ సినిమా తరువాత రవితేజ దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నారు. వారిద్దరి కాంబినేషన్ లో ఇది నాలుగో సినిమా. ఇంతకు ముందు వారిద్దరూ కలిపి 'డాన్ శీను’, ;బలుపు’, ’క్రాక్' సినిమాలు చేశారు. ఇప్పుడు వీరిద్దరూ కలిపి నాలుగో సినిమాకి శ్రీకారం చుట్టారు, ఇందులో శ్రీలీల కథానాయిక. ఈ సినిమా తరువాత రవితేజ ఇంకొక సినిమా కూడా ఒప్పుకున్నారని తాజా సమాచారం. ’నేను శైలజ’ లాంటి మంచి విజయాన్ని అందించిన కిషోర్ తిరుమల ఈ సినిమాకి దర్శకుడిగా పని చేస్తారని తెలుస్తోంది.
కిషోర్ తిరుముల చివరి సినిమా 'ఆడవాళ్ళు విూకు జోహార్లు’, శర్వానంద్ ఇందులో కథానాయకుడు. ఇది 2022లో వచ్చింది. ఆ తరువాత కిషోర్ తిరుమల తన కథపై పనిచేస్తూ వున్నారని, ఈమధ్యనే రవితేజకి కథని వినిపించడం జరిగిందని కూడా తెలిసింది. కథ నచ్చి రవితేజ సినిమా చెయ్యాలని నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ సినిమాని ఎవరు నిర్మిస్తారు అనే విషయం కూడా కొన్ని రోజుల్లో తెలియనుంది చెపుతున్నారు. కిషోర్ తిరుమల మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు, అలాగే క్లీన్ సినిమాలు నిర్మిస్తారని కుటుంబం అంతా చూసీ విధంగా వుంటాయి. కిషోర్ మంచి రచయిత కూడాను. ఇప్పుడు కిషోర్ తిరుమల, రవి తేజ కాంబినేషన్ లో రాబోయే ఈ సినిమా ఒక మంచి కుటుంబ కథా చిత్రంగా ఉండబోతోందని అంటున్నారు.
ఇంకా చదవండి: 'థగ్‌లైఫ్'లోకి నాజర్, అభిరామి!
# KishoreTirumala # RaviTeja # Tollywood