'సంగ్రామ్‌ భలేరావ్‌'గా రణ్‌వీర్‌ సింగ్‌!

'సంగ్రామ్‌ భలేరావ్‌'గా రణ్‌వీర్‌ సింగ్‌!

1 month ago | 17 Views

'సంగ్రామ్‌ భలేరావ్‌'గా ’సింగమ్‌ అగైన్‌’తో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్‌ కథానాయకుడు రణ్‌వీర్‌ సింగ్‌. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో రానున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. రణ్‌వీర్‌ తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఈ షూటింగ్‌ పూర్తయ్యాక అదిత్య ధర్‌తో ఓ సినిమాని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దానికి 'ధురంధర్‌’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్టు తెలిసింది.

'ఈ కలయికలో రానున్న తొలి చిత్రం కాబట్టి చిత్రబృందం ఈ సినిమాని ఎంతో ప్రత్యేకంగా తెరకెక్కించనుంది. ఈ భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ని రాజకీయాలు, గ్యాంగ్‌వార్‌ నేపథ్యంలో రూపొందించనున్నారు. జూన్‌లో దీని చిత్రీకరణను మొదలుపెట్టనున్నారు’ అని సన్నిహితవర్గాలు తెలిపాయి.

ఇంకా చదవండి: రామోజీ ఫిల్మ్‌ సిటీలో మలేషియా సెట్టింగ్‌.. శరవేగంగా 'పుష్ప-2' షూటింగ్‌.. ఐటమ్‌ సాంగ్‌ కోసం జాన్వీని ఒప్పించే ప్రయత్నం!

# SinghamAgain     # Dhuandhaar     # RanveerSingh     # TeluguCinema