రామ్‌గోపాల్ వర్మ 'శారీ' టీజర్ విడుదల!
1 month ago | 5 Views
టాలీవుడ్ విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ లేటెస్ట్ మూవీ ’శారీ’. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో, ఆర్జీవి-ఆర్వి ప్రొడక్షన్స్ పై ప్రముఖ వ్యాపారవేత్త రవి శంకర్ వర్మ నిర్మిస్తున్నారు. సత్య యాదు, ఆరాధ్య దేవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ పలు నిజజీవిత సంఘటనల ఆధారాలతో సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. కాగా ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఫిబ్రవరి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో భాగంగా తాజాగా ’శారీ’ సినిమాకు
సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ ఉహించని విధంగా ఉంది. అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి బాగా చూపించారు. కొంత భయంగా కూడా ఉంది. ఇక దర్శక, నిర్మాత రామ్ గోపాల్ వర్మ ’సోషల్ విూడియాలో ఎవరెవరు ముక్కు మొహం తెలియని వాళ్ళతో పరిచయం పెంచుకుని, వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ గాని, ఫోర్ గ్రౌండ్ గాని, ఏమి తెలియకుండా నమ్మేయడంతో, ఎదురయ్యే ప్రమాదాలు, భయంకర సంఘటనలు, మనం చాలా చాలా విన్నాం! చూసాం! ఇలాంటి నిజ జీవిత ఘటన ఆధారంగా తీసిన సినిమా ఈ ’శారీ’ మూవీ’ చెప్పారు. ఇక నిర్మాత రవిశంకర్ వర్మ మాట్లాడుతూ ’మా ’శారీ’ చిత్రంలోని టీజర్, ’ఐ వాంట్ లవ్’ అండ్ ’ఎగిరే గువ్వలాగా?’ అనే రెండు లిరికల్ సాంగ్స్ విడుదల చేసాము. వాటికి సోషల్ విూడియాలో విశేష స్పందన లభించింది. ఈ రోజు ట్రైలర్ మాంగో విూడియా ద్వార తెలుగు, హిందీ, తమిళ, మరియు మళయాళ భాషల్లో విడుదల చేసాము. సినిమా ఈ నెల 28న అన్ని భాషల్లో థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నాం తప్పక చూడండి’ అంటూ తెలిపారు.
ఇంకా చదవండి: ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానున్న రాక్షస
"Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!"