రెండు భాగాలుగా రానున్న రణబీర్ కపూర్, సాయిపల్లవి "రామాయణ"! విడుదల తేదీ అధికారక ప్రకటన...
1 month ago | 5 Views
రణబీర్ కపూర్, సాయిపల్లవి సీతారాములుగా 'కేజీఎఫ్' యశ్ రావణుడిగా నటిస్తోన్న చిత్రం ‘రామాయణ’. అమీర్ ఖాన్‌తో దంగల్ వంటి భారీ బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని రూపొందించిన నితీశ్ తివారి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పదికాలాలు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయేవిధంగా ఉండేలా మేకర్స్ చాలా కసరత్తు చేస్తున్నారు. మూడు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతుండగా వాటిలో రెండు భాగాల విడుదల తేదీలను సోషల్ మీడియా వేదికగా వెల్ల్లడించారు. మొదటి భాగాన్ని 2026, రెండో భాగాన్ని 2027 దీపావళికి పాన్ ఇండియాగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా సినిమాలోని నటీనటులు లుక్స్ లీక్‌లు కాకుండా ఉండేందుకు సెట్స్‌లోకి సెల్‌ఫోన్‌లను నిషేధించారు. ఇందులో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌సింగ్ కనిపించనున్నట్లు టాక్ నడుస్తోంది. దీనికి తెలుగు వెర్షన్ సంభాషణలు రాసే బాధ్యతలు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు అప్పగించినట్లు సమాచారం.
ఇంకా చదవండి: యంగ్ చాప్ నందమూరి తారక రామారావు స్పెషల్ పోస్టర్ విడుదల