టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన రజిషా విజయన్‌!

టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన రజిషా విజయన్‌!

8 months ago | 78 Views

తనదైన నటనతో  తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది రజిషా విజయన్‌. కోలీవుడ్‌ స్టార్‌ కార్తి హీరోగా నటించిన 'సర్దార్‌’ చిత్రంలో ఆమె పోషించిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం తెరకెక్కుతోన్న 'సర్దార్‌2’లోనూ రజిషా కీలక పాత్ర పోషిస్తోందని మేకర్స్‌  ప్రకటించారు. ఆమెకు వెల్‌కమ్‌ చెబుతూ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. పిఎస్‌ మిత్రన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్‌, ఆషికా రంగనాథ్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఎస్‌ జే సూర్య మరో ప్రముఖ  పాత్ర చేస్తున్నాడు.

ప్రిన్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎస్‌ లక్ష్మణ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్‌ జరుగుతోందని, భారీ బ్జడెట్‌తో రూపొందిస్తున్నట్టు నిర్మాత తెలియజేశారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నాడు. రెండేళ్ల క్రితం వచ్చిన ’సర్దార్‌’ సక్సెస్‌ అందుకోవడంతో  సీక్వెల్‌పైనా అంచనాలు ఏర్పడ్డాయి.

ఇంకా చదవండి: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ముఖ్య అతిథులుగా 'మారుతి నగర్ సుబ్రమణ్యం' ప్రీ రిలీజ్ ఈవెంట్

# Sardar 2     # Karthi     # Malavika Mohanan     # Rajisha Vijayan