రజనీ 'వేట్టయాన్‌' మూవీ : సాదాసీదా కథతో పట్టు తప్పిన కథనం!

రజనీ 'వేట్టయాన్‌' మూవీ : సాదాసీదా కథతో పట్టు తప్పిన కథనం!

8 hours ago | 5 Views

గత సంవత్సరం 'జైలర్‌' వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రం తర్వాత సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన  కొత్త చిత్రం 'వేట్టయాన్‌' . దర్శకుడు 'జై భీమ్‌' వంటి కల్ట్‌ చిత్రాన్ని అందించిన టీ.జె.జ్ఞానవేల్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా భారీ బడ్జెట్‌ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ పాన్‌ ఇండియా మూవీగా నిర్మించింది. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ మంజు వారియర్‌, ఫహాద్‌ ఫాజిల్‌ రానా దగ్గుబాటి, రితికా సింగ్‌, దుషరా విజయన్‌, రోహిణి, అభిరామి ఇతర కీలక పాత్రల్లో నటించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. 

గురువారం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా రజనీకాంత్‌ ఇంట్రో బాగా కుదిరిందని కానీ ఫస్టాఫ్‌ చాలా స్లోగా నడిపించారని ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ అదిరిపోయిందని చాలామంది పోస్టులు పెట్టాడుతున్నారు. సినిమాకు అనిరుధ్‌ సంగీతం వెన్నెముక అని మరోసారి తనేంటో రుజువు చేసుకున్నాడని,సెకండాఫ్‌ సినిమాకు బలమని అంటున్నారు. ముఖ్యంగా నేటి టెక్నాలజీని ఉపయోగించు కుని హత్యలు చేస్తున్న ఓ సీరియల్‌ కిల్లర్‌ను పట్టుకునే నేపథ్యంలో సాగే కథతో రజనీకాంత్‌తో జ్ఞాన్‌వే ల్‌ రాజా మంచి ప్రయోగం చేశాడని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ మోప్పిస్తారని పోస్టులు పెడతున్నారు. సినిమా థ్రిల్లర్‌గా నడిచినా భావోద్వేగాలు కూడా ఆకట్టుకుంటాయంటున్నారు. అథియన్‌ ఓ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌. నిజాయతీతో పాటు ధైర్యం ఎక్కువ. న్యాయం కోసం చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడడు. అలాంటి అధికారిని శరణ్య (దుశారా విజయన్‌) అనే ఓ స్కూల్‌ టీచర్‌ హత్య కలచి వేస్తుంది. ఆ హత్యకి పాల్పడిన నిందితుడు తప్పించుకోవడంతో ప్రభుత్వంపైనా, పోలీసు అధికారులపైనా ఒత్తిడి పెరుగుతుంది. దాంతో అథియాన్‌ రంగంలోకి దిగాల్సి వస్తుంది. ఆయన కేసు బాధ్యతల్ని తీసుకున్న తర్వాత కొన్ని గంటల్లోనే హంతకుడిని మట్టు బెడతాడు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలేమిటి?మానవ హక్కుల కోసం పోరాటం చేస్తున్న న్యాయమూర్తి సత్యదేవ్‌ (అమితాబ్‌ బచ్చన్‌) ఈ ఎన్‌కౌంటర్‌ని ఎందుకు తప్పు పట్టాడు. ఆ కేసుని మళ్లీ పరిశోధించాల్సిన అవసరం అథియాన్‌కి ఎందుకొచ్చింది? విజయవంతమైన తన 'జై భీమ్‌’ తరహాలోనే మరోసారి దర్శకుడు న్యాయం, విద్య సమానంగా అందాలనే ఓ బలమైన అంశాల్ని ఎంచుకుని ఈ చిత్రాన్ని మలిచారు.

కథ చెప్పిన ఉద్దేశం, దాన్ని ఓ కైమ్ర్‌ థ్రిల్లర్‌గా ఎన్‌కౌంటర్స్‌తో ముడిపెట్టి చెప్పిన విధానం మెచ్చుకోదగ్గదే. అయితే రజనీకాంత్‌ ఇమేజ్‌కి తగ్గ వాణిజ్యాంశాలు కానీ, కథనం పరంగా  సగటు ప్రేక్షకుడిలో ఆసక్తిని రేకెత్తించే మలుపులు కానీ లేకపోవడంతో సినిమా ఒక దశ దాటిన తర్వాత సామాజిక వ్యాఖ్యానంతో కూడిన ఓ డాక్యుమెంటరీలా అనిపిస్తుంది. సినిమా అంతా కేవలం ఓ హత్య కేసు చుట్టూనే సాగడం కూడా పెద్దగా మెప్పించదు. రజనీకాంత్‌ని ఆయన మార్క్‌ సన్నివేశాలతోనే పరిచయం చేసిన దర్శకుడు ఆ తర్వాత మెల్లగా కథలోకి వెళ్లారు. మానవ హక్కుల కోసం పోరాటం చేసే న్యాయమూర్తి సత్యదేవ్‌కీ, ఎన్‌కౌంటర్‌ చేసిన అథియన్‌కీ మధ్య సంఘర్షణ ద్వితీయార్దానికి కీలకంగా ఉండొచ్చనే అభిప్రాయం కలిగినా, దర్శకుడు ఆ దిశగా దృష్టి పెట్టలేదు. దాంతో ఆ రెండు పాత్రల మధ్య సన్నివేశాలు సాదాసీదాగా సాగిపోతుంటాయి. ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో సాగిన డ్రామా కాస్త, ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ మాఫియా వైపు మళ్లడం, ఆ తర్వాత సన్నివేశాలన్నీ ప్రేక్షకుడి ఊహకు అందేలా సాగడంతోనే  సినిమా పట్టు తప్పింది. రానా దగ్గుబాటి కార్పొరేట్‌ శక్తిగా కనిపిస్తాడు. ఆయన ఆ  పాత్రలో కనిపించిన విధానం  ఆకట్టుకుంటుంది. రితికా సింగ్‌, దుషారా విజయన్‌, మంజు వారియర్‌ పాత్రలు కథలో కీలకం. సాంకేతికంగా సంగీతం, కెమెరా విభాగాలు మంచి పనితీరుని కనబరిచాయి. దర్శకుడి కథాలోచన బాగుంది. మాటల్లో బలం ఉంది. కానీ కథని నడిపించిన విధానమే అంతగా మెప్పించదు. కథనం పరంగా మరిన్ని కసరత్తులు జరగాల్సింది. నిర్మాణం ఉన్నతంగా ఉంది.

ఇంకా చదవండి: sunNXT OTTలో అక్టోబర్ 11న వరలక్ష్మీ శరత్ కుమార్‌ 'శబరి' 5 భాషల్లో విడుదల...

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# Vettaiyan     # Rajinikanth     # TJGyanvel