చిత్రీకరణ ముగింపులో రాజసాబ్!
3 months ago | 32 Views
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ’రాజా సాబ్’ చిత్రీకరణ పరుగులు పెడుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో ప్రభాస్, కథానాయికలు, కొద్దిమంది హాస్యనటులపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్న చిత్రమిది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్‌తోపాటు మరో కథానాయిక ఇందులో నటిస్తోంది.
హారర్ అంశాలతో కూడిన రొమాంటిక్ చిత్రమిది. ప్రభాస్ స్టైలిష్ అవతారంలో సందడి చేయనున్నారు. ప్రభాస్ చేతిలో చాలా సినిమాలే ఉన్నా, కొంతకాలంగా ’రాజా సాబ్’ సినిమాపైనే దృష్టి కేంద్రీకరించారు. దాంతో సినిమా శరవేగంగా సాగుతోంది. వచ్చే వేసవి సందర్భంగా ఏప్రిల్ 10న ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ప్రభాస్ సినిమాలకు తగ్గట్టుగానే భారీ హంగులతో ’రాజాసాబ్’ రూపొందుతోంది. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
ఇంకా చదవండి: సామాన్య జీవితాలకు దగ్గరగా ఉండే సినిమా "లైఫ్ స్టోరీస్" సెప్టెంబర్ 14న బ్రహ్మాండమైన విడుదల
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!