రాజమౌళి అంకిత భావం అందరికీ స్ఫూర్తి.. 'మోడ్రన్ మాస్టర్స్' డాక్యుమెటరీపై రామ్‌చరణ్
4 months ago | 75 Views
దర్శకధీరుడు రాజమౌళిపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ప్లిక్స్ 'మోడ్రన్ మాస్టర్స్’ పేరుతో డాక్యుమెంటరీ రూపొందించిన సంగతి తెలిసిందే. ఇటీవలే అందుబాటులోకి వచ్చిన ఈ డాక్యుమెంటరీ మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. ఇప్పటికే దీనిపై పలువురు ప్రముఖులు వారి అభిప్రాయాలను తెలియజేస్తూ పోస్ట్ పెట్టారు. తాజాగా రామ్ చరణ్ ఈ డాక్యుమెంటరీ పై ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. 'రాజమౌళికి సినిమాలపై, కథలపై ఉన్న అంకితభావం ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతుంటుంది. ఈ 'మోడ్రన్ మాస్టర్స్’ డాక్యుమెంటరీ ఆయన ఉజ్వల కెరీర్‌కు మనమిచ్చే సరైన గౌరవం’ అని పేర్కొన్నారు. ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి గురించి రామ్ చరణ్ మాట్లాడారు.
ఆయన దర్శకత్వంలో 'మగధీర’, 'ఆర్‌ఆర్‌ఆర్’లలో నటించడంపై తన అనుభవాలను పంచుకున్నారు. సినిమాలంటే రాజమౌళికి ఎంతో గౌరవమన్నారు. రాఘవ్ కన్నా దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ 'నెట్‌ప్లిక్స్’వేదికగా ఆగస్టు 2నుంచి అందుబాటులోకి వచ్చింది. పలువురు హాలీవుడ్ దర్శకులు, సినీ ప్రముఖులు రాజమౌళిపై వారి అభిప్రాయాలను తెలియజేశారు. టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఈ దర్శకధీరుడితో వారి అనుబంధాన్ని పంచుకున్నారు. రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌బాబుతో తీయనున్న ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. దీని ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా మహేశ్ న్యూ లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాజమౌళి సినిమా కోసమే ఆయన లుక్ మార్చుకున్నట్లు తెలుస్తోంది.
ఇంకా చదవండి: నా పై వార్తలు రాసే ముందు సంప్రదించరా : డేటింగ్‌పై సోషల్ విూడియా ప్రచారంపై కృతి ఆగ్రహం
# ModernMasters # SSRajamlouli # Ramcharan # August2