కెన్యాలో ప్రిపరేషన్ వర్క్‌లో రాజమౌళి
1 month ago | 5 Views
ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం కెన్యాలో ఉన్నారు. ఇందులోభాగంగా అంబోసెలి నేషనల్ పార్క్‌లో తీసిన ఓ ఫొటోని షేర్ చేసిన ఆయన తాజాగా ఇన్‌స్టా వేదికగా మరో పోస్ట్ పెట్టారు. అడవికి రారాజుగా పిలిచే సింహం ఫొటోని షేర్ చేశారు. ’క్రిస్ ఫాలోస్ తీసిన సెరెంగేటి (టాంజానియాలోని ఒక ప్రాంతం) రాజు ఫొటో ఇది. ప్రస్తుతం ఇది నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. తన తదుపరి సినిమా లొకేషన్స్ సెర్చ్‌లో భాగంగానే జక్కన్న అక్కడికి వెళ్లారని పలువురు భావిస్తున్నారు. దీంతో ఎంబి 29పై సినీప్రియుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ’బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం పక్కా’, ’షూటింగ్ అప్‌డేట్‌లు కూడా ఇవ్వగలరు’, ’మేము కూడా విూతోనే వచ్చేస్తాం సర్’ అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక మూవీ విషయానికి వస్తే.. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. విజయేందప్రసాద్ కథ అందించారు. భారీ డ్జెట్‌తో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఇది సిద్ధం కానుంది.
అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జనవరి నుంచి ఈ సినిమా షూట్ మొదలు కానుందని ఇప్పటికే చిత్ర రచయిత ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం లొకేషన్స్ వేటలో పడినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా కెన్యాలో పర్యటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో మహేశ్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఆ పాత్ర కోసం ఆయన ఇప్పటికే సన్నద్ధమయ్యారు. ఈ సినిమాను ప్రకటించినప్పటినుంచి అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. దీనికి ’గరుడ’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
ఇంకా చదవండి: హీరోయిన్ నయనతారపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ...!