రాజమౌళి, మహేష్ బాబుల కాంబో.. క్రేజీ పాజెక్ట్‌పై ర్యూమర్స్‌..నమ్మవద్దన్న సంస్థ!!

రాజమౌళి, మహేష్ బాబుల కాంబో.. క్రేజీ పాజెక్ట్‌పై ర్యూమర్స్‌..నమ్మవద్దన్న సంస్థ!!

1 month ago | 15 Views

స్టార్‌ డైరెక్టర్‌ రాజమౌళి దర్శకత్వంలో అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ఓ సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ ఎప్పుడు మొదలవుతుందా అని సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించిన చిన్న విషయం బయటకు వచ్చినా అది క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌ కాస్టింగ్‌ గురించి ఓ వార్త సోషల్‌ విూడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. దీనిపై నిర్మాణ సంస్థ క్లారిటీ ఇస్తూ నోట్‌ రిలీజ్‌ చేసింది. 'రాజమౌళి`మహేష్ బాబు ప్రాజెక్ట్‌కు సంబంధించిన నటీనటుల ఎంపికపై రకరకాల వార్తలు వస్తున్నాయి. కొన్ని ఆంగ్ల వెబ్‌సైట్స్‌లో వెలువడిన కథనాలు మా దృష్టికి వచ్చాయి. కాస్టింగ్‌ డైరెక్టర్‌ వీరేన్‌ స్వామి సినిమాలో భాగమైనట్లు రాశారు.

అందులో నిజం లేదు.ఈ మూవీకి సంబంధించి ఏ అప్‌డేట్‌ అయినా మేమే ఇస్తాం. ప్రొడక్షన్‌ హౌస్‌ నుంచి వచ్చే అధికారిక ప్రకటనను తప్ప మరే ఇతర అప్‌డేట్‌లను నమ్మొద్దు’ అని శ్రీ దుర్గ ఆర్ట్స్‌ పేర్కొంది. ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌కు 'మహారాజ్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇందులో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ హీరోయిన్‌గా, హాలీవుడ్‌ ప్రముఖ నటుడు క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ కీలకపాత్ర పోషించనున్నారని కూడా జోరుగా ప్రచారమవుతోంది. మరోవైపు మహేష్ బాబు కూడా ఈ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. తన లుక్‌ను కూడా మార్చుకున్నారు.

ఇంకా చదవండి: వెర్సటైల్ హీరో సూర్య చేతుల మీదగా హిట్ లిస్ట్ మూవీ టీజర్ లాంచ్

# SSMB29     # SSRajamouli     # Maheshbabu     # TeluguCinema