రాజ్‌తరుణ్‌ 'పురుషోత్తముడు'

రాజ్‌తరుణ్‌ 'పురుషోత్తముడు'

5 months ago | 66 Views

ఒక వైపు లావణ్య వివాదం నడుస్తుంటే.. మరోవైపు తన సినిమాలను టాలీవుడ్‌ యువ నటుడు రాజ్‌ తరుణ్‌

చకచకా పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే 'భలే ఉన్నాడే' సినిమాతో బిజీగా ఉన్న ఈ కుర్ర హీరో మరో సినిమాను విడుదలకు రెడీ చేశాడు. రాజ్‌తరుణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'పురుషోత్తముడు’. ఈ సినిమాకు రామ్‌ భీమన దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీదేవి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై రమేష్‌ తేజావత్‌, ప్రకాష్‌ తేజావత్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్‌.


ఒక గ్రామం కోసం.. అందులో ఉన్న ప్రజల కోసం డబ్బున్న ఒక కుర్రాడు.. తన అంతస్తును, హోదాను పక్కనపెట్టి ఏం చేశాడు అనేది ఈ సినిమా స్టోరీ అని తెలుస్తుంది. చూస్తుంటే మహేశ్‌ బాబు శ్రీమంతుడు వైబ్‌లు వస్తున్న కొత్తగా ఉంది. ఇక విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా టీజర్‌ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో హాసిని, సుధీర్‌ కథానాయికగా నటిస్తుండగా.. మురళీశర్మ, కౌసల్య, ప్రకాష్‌రాజ్‌, రమ్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పీజీ విందా, సంగీతం: గోపీ సుందర్‌, రచన`దర్శకత్వం: రామ్‌ భీమన.

ఇంకా చదవండి: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ "తంగలాన్" సినిమా

# Purushothamudu     # Rajtarun     # Hasini     # July26    

trending

View More