'బాక్' చిత్రం నుంచి మాయగా రాశి ఖన్నా, టైగర్‌గా వెన్నెల కిషోర్‌ ఫస్ట్ లుక్స్ విడుదల

'బాక్' చిత్రం నుంచి మాయగా రాశి ఖన్నా, టైగర్‌గా వెన్నెల కిషోర్‌ ఫస్ట్ లుక్స్ విడుదల

2 months ago | 58 Views

అత్యంత విజయవంతమైన హార్రర్ కామెడీ సిరీస్ 'అరణ్మనై' దాని నాల్గవ వెర్షన్‌ మరింత బిగ్గర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సుందర్ సి దర్శకత్వం వహించడంతో పాటు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి తెలుగు టైటిల్ 'బాక్'.  తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన పాత్రలు పోషించగా, వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్,  కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మేకర్స్ నిన్న ఫస్ట్ లుక్ పోస్టర్ల ద్వారా సుందర్ సి, తమన్నా భాటియా పాత్రలను పరిచయం చేశారు. ఈరోజు రాశీఖన్నా, వెన్నెల కిషోర్‌ల ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లను విడుదల చేశారు. రెండు పోస్టర్లలో హాంటెడ్ హౌస్ నేపథ్యంలో భయానకంగా వుంది. రాశి ఖన్నా టెర్రిఫైడ్ గా కనిపించగా, వెన్నెల కిషోర్ కూడా టెన్షన్‌ పడతూ కనిపించారు.

అవ్ని సినిమాక్స్ పి లిమిటెడ్ పతాకంపై ఖుష్బు సుందర్, ఎసిఎస్ అరుణ్ కుమార్ నిర్మించారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ LLP ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలలో విడుదల చేయనుంది.

హిప్హాప్ తమిళా సంగీతం అందించగా, ఇ కృష్ణమూర్తి సినిమాటోగ్రఫీ, ఫెన్నీ ఆలివర్ ఎడిటింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు. గురురాజ్ ఆర్ట్ డైరెక్టర్.  

తారాగణం: సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా, వై వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్,  కోవై సరళ

సాంకేతిక విభాగం:

కథ & దర్శకత్వం: సుందర్ సి

నిర్మాత: ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్

బ్యానర్:  అవ్ని సినిమాక్స్ P Ltd.

తెలుగు రిలీజ్ : ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి

సంగీతం: హిప్హాప్ తమిళా

సినిమాటోగ్రాఫర్: ఇ కృష్ణమూర్తి అకా కిచ్చ

ఎడిటర్: ఫెన్నీ ఆలివర్

ఆర్ట్: గురురాజ్

కొరియోగ్రఫీ: బృందా మాస్టర్

స్టంట్స్: రాజశేఖర్

పీఆర్వో: వంశీ-శేఖర్

ఇంకా చదవండి: హాలీవుడ్‌ యాక్షన్‌ మూవీ 'జోకర్‌'కు సీక్వెల్‌!

# Baak     # RaashiKhanna     # VenneleKishore