రిలీజ్‌కు ముందు 'పుష్పా2' సంచలనాలు

రిలీజ్‌కు ముందు 'పుష్పా2' సంచలనాలు

5 months ago | 49 Views

 ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న ప్రాంఛైజీ ప్రాజెక్ట్‌ 'పుష్ప ది రూల్‌' సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఆగస్టులో రావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తూ.. డిసెంబర్‌ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు తెలియజేశారు. కాగా ఇప్పుడు 'పుష్ప 2' హిందీ వెర్షన్‌ నాన్‌ థ్రియాట్రికల్‌ రైట్స్‌కు సంబంధించిన వార్త ఒకటి హాట్‌ టాపిక్‌గా మారింది. తమిళ నిర్మాత కేఈ జ్ఞావవేళ్‌ రాజా ఈ మూవీ నాన్‌ థ్రియాట్రికల్‌ రైట్స్‌ రూ.260 కోట్ల భారీ మొత్తం పలికాయి. సింగిల్‌గా లేదా మల్టీ లాంగ్వేజ్‌ పరంగా చూసుకున్నా నాన్‌ థ్రియాట్రికల్‌ రైట్స్‌ విషయంలో ఈ ఫిగర్‌ ఇండియన్‌ సినీ చరిత్రలోనే అతి పెద్దదని చెప్పారు.

ఇప్పుడీ కామెంట్స్‌ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్టీగ్రా నిలుస్తున్నాయి. ఈ మూవీకి రాక్‌స్టార్‌ దేవీ శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు. ఇప్పటికే మ్యూజిక్‌ ప్రమోషన్స్‌ షురూ చేసిన బన్నీ టీం.. పుష్ప పుష్ప సాంగ్‌ లాంచ్‌ చేయగా నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్‌ రాబడుతోంది. మరోవైపు రెండో సాంగ్‌ సూసేకి కూడా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్‌తోపాటు వేల సంఖ్యలో రీల్స్‌ నెట్టింట సందడి చేస్తున్నాయి.  'పుష్ప ది రూల్‌'లో ఫహద్‌ ఫాసిల్‌, జగదీష్‌ ప్రతాప్‌ బండారి, జగపతిబాబు, ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేశ్‌, ధనంజయ, షణ్ముఖ్‌, అజయ్‌, శ్రీతేజ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇంకా చదవండి: ఆసక్తి రేకెత్తిస్తున్న 'తంగలాన్‌' పోరాటాలు

# Pushpa2     # Rashmikamandanna     # Alluarjun    

trending

View More