రిలీజ్‌కు ముందే 'పుష్ప 2' రికార్డు!
1 month ago | 5 Views
'పుష్పరాజ్ అంటే ఫైర్ అనుకుంటివా.. వైల్డ్‌ఫైర్' అనుకుంటూ అల్లు అర్జున్ ట్రైలర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పుష్ప 2 ట్రైలర్ సెకండ్స్‌లోనే మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకొని యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఓవర్సీస్ బుకింగ్స్ స్టార్ట్ అవ్వగా అరుదైన రికార్డును సాధించింది ఈ చిత్రం.
అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్‌లో తాజాగా 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వసూలు చేసింది ఈ చిత్రం. సినిమా విడుదలకు ఇంకా 15 రోజులు ఉండగా.. ఇప్పుడే 1 మిలియన్ కలెక్ట్ చేయడంతో అమెరికాలో ఈ ఫీట్ సాధించిన ఫస్ట్ సినిమాగా నిలిచింది. అయితే విడుదలకు ముందే ఈ రేంజ్‌లో బుకింగ్స్ ఉంటే ఇంకా విడుదలయ్యాకా ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
ఇంకా చదవండి: మరో కర్తవ్యం.."ఝాన్సీ ఐపీఎస్". నవంబర్ 29న గ్రాండ్ రిలీజ్