అదిరిన 'పుష్ప-2' ప్రమోషనల్ ప్లాన్!?
1 month ago | 5 Views
టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ కాంపౌండ్ నుంచి వస్తోన్న ప్రాంచైజీ ప్రాజెక్ట్ 'పుష్ప 2 ది రూల్'. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీని 2024 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లేలా ప్రమోషనల్ ప్లాన్ గట్టిగానే చేశారన్న వార్త అభిమానుల్లో జోష్ నింపుతోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం ఫస్ట్ ఈవెంట్‌ను బీహార్‌లోని పాట్నాలో నవంబర్ చివరలో ప్లాన్ చేశారట.
ఆ తర్వాత హుబ్లీ, కోచి, చెన్నైలలో పలు మేజర్ ఈవెంట్స్‌ను ప్లాన్ చేశారని ఇన్‌సైడ్ టాక్. అంతేకాదు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను ముంబైలో ఇదివరకెన్నడూ కనివినీ ఎరుగని రీతిలో భారీ జన సందోహం మధ్య నిర్వహించేందుకు రెడీ అవుతున్నారని ఫిలిం నగర్ సర్కిల్ సమాచారం. ప్రమోషన్స్ చివరి ఘట్టంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో పాటు పలు ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేసినట్టు టాక్. ఫస్ట్ పార్టుకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆల్బమ్ అందించిన రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సీక్వెల్‌కు కూడా పనిచేస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. సీక్వెల్‌లో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇంకా చదవండి: త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’...
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# పుష్ప 2 ది రూల్ # అల్లు అర్జున్ # ఫహద్ ఫాసిల్