'పుష్పా2' సినిమా ఒకరోజు ముందే విడుదలకు ప్లాన్‌!

'పుష్పా2' సినిమా ఒకరోజు ముందే విడుదలకు ప్లాన్‌!

2 months ago | 5 Views

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న 'పుష్ప 2 ది రూల్‌’ సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా కోసం ఎంతగానో వేచి చూస్తున్న వారందరికీ ఓ గుడ్‌ న్యూస్‌. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం 'పుష్ప 2’ చిత్రం ప్రకటించిన డేట్‌ కంటే ఒకరోజు ముందుగానే విడుదల కానుందని తెలుస్తోంది.


డిసెంబర్‌ 5 రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించి గురువారం నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. గురువారం హైదరాబాద్‌లో 'పుష్ప 2 ది రూల్‌’ విూడియా సమావేశం గ్రాండ్‌గా జరగబోతోంది. ఈ సమావేశంలో ఈ సినిమా విడుదలకు సంబంధించిన మేకర్స్‌ ఒక రోజు ముందుగానే అనే ప్రకటన చేయబోతున్నారనేది లేటేస్ట్‌ అప్డేట్‌. ఈ విూడియా సమావేశానికి మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రొడ్యూసర్స్‌తో పాటు, హిందీ వెర్షన్‌ను విడుదల చేస్తున్న అనిల్‌ తడానీ, తమిళ్‌ వెర్షన్‌ రిలీజ్‌ చేస్తోన్న ఎజిఎస్‌ సంస్థ ప్రతినిధులు, డిస్టిబ్యూట్రర్స్‌ హాజరుకానున్నారనేది తాజా సమాచారం.

ఇంకా చదవండి: 'ది రాజా సాబ్‌' స్పెషల్‌ మోషన్‌ పిక్చర్‌ విడుదల!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# పుష్పా2     # అల్లు అర్జున్‌    

trending

View More