ఈ నెల 17వ తేదీ నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కు వస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ "కలి"
2 months ago | 5 Views
యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటించిన సినిమా "కలి". ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మించారు. శివ శేషు దర్శకత్వం వహించారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఈ నెల 4వ తేదీన థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడీ మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ నెల 17వ తేదీ నుంచి "కలి" ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
ఈ రోజు సమాజాన్ని పట్టి పీడిస్తున్న జాఢ్యం ఆత్మహత్యలు. ఆత్మహత్యకు పురికొల్పే ఆలోచలను కొద్ది సేపు నియంత్రించుకుంటే ఎన్నో ప్రాణాలు నిలుస్తాయనే మంచి పాయింట్ తో "కలి" సినిమా రూపొందింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మంచి మ్యూజిక్, ఎంటర్ టైన్ చేసే క్యారెక్టర్స్ తో ఈ సినిమా ప్రేక్షకుల్ని థియేటర్స్ లో ఆకట్టుకుంది. ఇప్పుడు ఈటీవీ విన్ లోనూ మరింతగా మూవీ లవర్స్ ఆదరణ పొందనుంది.
నటీనటులు - ప్రిన్స్, నరేష్ అగస్త్య, నేహా కృష్ణన్, గౌతంరాజు, గుండు సుదర్శన్, కేదార్ శంకర్, మని చందన, మధుమణి. తదితరులు.
టెక్నికల్ టీమ్:
సంగీతం - జీవన్ బాబు
ఎడిటర్ – విజయ్ కట్స్.
సినిమాటోగ్రఫీ – నిషాంత్ కటారి, రమణ జాగర్లమూడి.
పాటలు – సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి,
క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ - రాధాకృష్ణ తాతినేని, ధరణి కుమార్ టీఆర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఫణీంద్ర
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
సమర్పణ – కె. రాఘవేంద్ర రెడ్డి
నిర్మాత - లీలా గౌతమ్ వర్మ
రచన, దర్శకత్వం - శివ శేషు
ఇంకా చదవండి: ప్రభాస్ బర్త్ డే స్పెషల్: మిస్టర్ పర్ఫెక్ట్ గ్రాండ్ రీ-రిలీజ్
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!