ఓటీటీ లోకి ప్రియదర్శి 'డార్లింగ్'
4 months ago | 89 Views
ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్‌లో నటించిన యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ’డార్లింగ్’. జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్దమైంది. కథ విషయానికి వస్తే.. ఒక ట్రావెల్ ఏజెన్సీలో పని చేసే రాఘవకు పెళ్లి చేసుకొని హనీమూన్‌కు పారిస్ వెళ్లాలని కలలు కంటూ ఉంటాడు. ఈక్రమంలో ఒకటి రెండు సంబంధాలు పెళ్లి వరకు వచ్చి డిప్రెషన్‌లోకి వెళతాడు. అలాంటి సమయంలో ఆనంది (నభా నటేష్) పరిచయం అవడం, వివాహం చేసుకోవడం జరిగి పోతాయి. తీరా అసలువిషయం అప్పుడే మొదలవుతుంది. ఆనందికి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే వ్యాధి ఉన్నట్లు తెలుస్తుంది.
దీంతో ఆమె ఏ నిమిషం ఎలా ఉంటుంది, ఎలా ప్రవర్తిస్తుందనే విషయం అసలు అంతుచిక్కదు. ఈ నేపథ్యంలో రాఘవ ఆనందితో ఎలా కాపురం చేశాడు, హనీమూన్ కల తీరిందా లేక ఇద్దరూ విడిపోయారా? అసలు ఆనంది ఎవరు, ఆమె నేపథ్యం ఏంటి? ఆమె గతం గురించి తెలిసిన రాఘవ చివరికి ఏమి చేశాడు? అనే ఆసక్తికరమైన కథకథనాల చుట్టూ సినిమా సాగుతూ నవ్వులు పూయిస్తుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని నెల రోజులలోనే ఈ నెల 13వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్టీమ్రింగ్‌కు తీసుకు వస్తున్నారు. సో ఎవరైతే థియేటర్లలో మిస్సయ్యారో ఇక ఇంట్లోనే కుటుంబంతో కలిసి చూసి ఆనందించండి.
ఇంకా చదవండి: చైతన్య రావ్ హార్ట్ టచ్చింగ్ మూవీ 'డియర్ నాన్న' ఆగస్ట్ 1 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్
# Darling # Priyadarshi # NabhaNatesh # August13