25న వస్తున్న 'పొట్టేల్' మూవీ
3 months ago | 5 Views
వకీల్‌సాబ్ ఫేం, టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల తాజాగా 'తంత్ర' సినిమాతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అనంతరం మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ముందుకురాబోతుంది. ఆమె ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం 'పొట్టేల్'. యువ చంద్ర కృష్ణ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు 'బంధం రేగడ్’, 'సవారీ’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సాహిత్ మోతుకురి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా వస్తుండగా ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్స్, టీజర్‌లు తెగ ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ మూవీని దీపావళి కానుకగా అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమాను ఎన్‌ఐఎస్‌ఏ ఎంటర్‌టైనర్‌మెంట్ బ్యానర్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రగ్యా సన్నిది క్రియేషన్స్ బ్యానర్‌పై సురేష్ కుమార్ సడిగే సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరీ, నీల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఇంకా చదవండి: 'సింగమ్ అగైన్' ట్రైలర్ వచ్చేసింది!