తొలి రోజున రూ. 1.63 కోట్ల కలెక్షన్స్ సాధించిన ఫ్రెండ్ షిప్, లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ నిహారిక కొణిదెల ‘కమిటీ కుర్రోళ్ళు’
4 months ago | 41 Views
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, అటు యూత్‌ను ఆకట్టుకున్న ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మంచి పల్లెటూరి వాతావరణంలో స్నేహం, ప్రేమ, కుటుంబంలోని భావోద్వేగాలను ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో చక్కగా తెరకెక్కించారని అందరూ ప్రశంసిచారు.
ప్రశంసలతో పాటు సినిమాకు మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. వరల్డ్ వైడ్ ఈ చిత్రం తొలి రోజున రూ.1.63 కోట్లు గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ ప్రేక్షకులు సినిమాను ఆదరించారని ..ఇక వీకెండ్స్ అయిన శనివారం, ఆదివారం రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరుగుతాయని ట్రేడ్ వర్గాలంటున్నాయి.
నటీనటులు :
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, రాధ్య, తేజస్వి రావు, టీనా శ్రావ్య,విషిక ..ముఖ్య పాత్రల్లో సాయి కుమార్ ,గోపరాజు రమణ,బలగం జయరాం,శ్రీ లక్ష్మి ,కంచెరపాలెం కిషోర్ ,కిట్టయ్య ,రమణ భార్గవ్,జబర్దస్త్ సత్తిపండు తదితరులు
సాంకతిక వర్గం :
సమర్పణ - నిహారిక కొణిదెల, బ్యానర్స్- పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్, నిర్మాతలు - పద్మజ కొణిదెల,జయలక్ష్మి అడపాక, రచన, దర్శకత్వం - యదు వంశీ, సినిమాటోగ్రఫీ - రాజు ఎడురోలు, మ్యూజిక్ డైరెక్టర్ - అనుదీప్ దేవ్, ప్రొడక్షన్ డిజైనర్ - ప్రణయ్ నైని, ఎడిటర్ - అన్వర్ అలీ, డైలాగ్స్ - వెంకట సుభాష్ చీర్ల, కొండల రావు అడ్డగళ్ల, ఫైట్స్ - విజయ్, నృత్యం - జె.డి మాస్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - మన్యం రమేష్, సౌండ్ డిజైనర్: సాయి మణిందర్ రెడ్డి, పోస్టర్స్: శివ, ఈవెంట్ పార్ట్‌నర్: యు వి మీడియా, మార్కెటింగ్: టికెట్ ఫ్యాక్టరీ, పి.ఆర్.ఒ- బియాండ్ మీడియా (నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి).
ఇంకా చదవండి: తెలుగు మరియు బంజారా భాషల్లో 1980's లో రాదే కృష్ణ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ నేడు ఘనంగా జరిగింది
# CommitteeKurrollu # NiharikaKonidela # YadhuVamsi