ఓదెలకు సీక్వెల్‌గా 'ఓదెల-2' మూవీ.. అరంధతి, అఖండల కలయికలా సాగినకథ!

ఓదెలకు సీక్వెల్‌గా 'ఓదెల-2' మూవీ.. అరంధతి, అఖండల కలయికలా సాగినకథ!

14 days ago | 5 Views

మంచి ఆదరణ దక్కించుకున్న  సినిమా 'ఓదెల రైల్వేస్టేషన్‌’. క్రైమ్ థ్రిల్లర్‌గా ముస్తాబైన ఈ చిత్రానికి కొనసాగింపుగా ఇప్పుడు సూపర్‌ నేచురల్‌ హారర్‌ థ్రిల్లర్‌ నేపథ్యంతో 'ఓదెల 2’ను తీసుకొచ్చారు దర్శక, రచయిత సంపత్‌ నంది. తమన్నా కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం విడుదలయ్యింది.  ఇది ఓదెల గ్రామంలో జరిగే కథ. ఆ ఊరిలో కొత్తగా పెళ్ళైన అమ్మాయిల్ని అత్యాచారం చేసి చంపుతున్న తిరుపతి ని అతని భార్య రాధ (హెబ్బా పటేల్‌) నరికి చంపి జైలుకు వెళ్తుంది. తిరుపతి పీడ విరగడైందని ప్రజలు ఆనందపడేలోపు అతని ఆత్మ.. ప్రేతాత్మగా మారి ఊరి ప్రజలపై పగ తీర్చుకోవడం మొదలు పెడుతుంది. ఊరిలో రెండు పెళ్లిళ్లు జరగ్గా.. తిరుపతి ప్రేతాత్మ వేరొకరి శరీరంలోకి ప్రవేశించి, ఆ నవ వధువుల్ని అత్యాచారం చేసి చంపేస్తుంది. దీంతో తిరుపతి భయంకర దుష్టశక్తిగా మారాడన్న విషయం ఓదెల వాసులకు తెలుస్తుంది. మరి ఆ తర్వాత ఏమైంది? తిరుపతి ప్రేతాత్మ ఓదెలలో ఇంకెన్ని ప్రాణాలు బలి తీసుకుంది? ఓదెలను కాపాడటానికి వచ్చిన నాగ సాధువు భైరవి (తమన్నా)కి.. తిరుపతి ప్రేతాత్మకు మధ్య ఎలాంటి పోరు నడిచింది? అన్నది చిత్ర కథ. ఓదెల తొలి భాగం కథ ఎక్కడైతే ముగిసిందో.. అక్కడి నుంచే ఈ సీక్వెల్‌ కథ మొదలవుతుంది. అయితే అది పూర్తిగా క్రైమ్ థ్రిల్లర్‌ సినిమాగా సాగితే.. ఇది మాత్రం ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడి ఉన్న సూపర్‌ నేచురల్‌ హారర్‌ థ్రిల్లర్‌గా ముస్తాబైంది. కథలో  'అరుంధతి’ ఛాయలు.. కథానాయిక క్యారెక్టరైజేషన్‌ విషయంలో ’అఖండ’ చిత్రం గుర్తు రాక మానవు. దర్శకుడు సంపత్‌ కథను రాసిన తీరు.. తెరపైకి తీసుకొచ్చిన విధానం చూస్తే ఈ రెండు హిట్‌ సినిమాల్ని మిక్సీలో వేసి బయటకు తీశాడేమో అన్న ఫీలింగే కలుగుతుంది. 'ఓదెల’లో తిరుపతి తలను పట్టుకుని రాధ పోలీస్‌స్టేషన్‌కు రావడంతో కథ మొదలవుతుంది.  అక్కడి నుంచి ప్రేక్షకుల్ని కథలో వెనక్కి తీసుకెళ్లాడు దర్శకుడు. రాధ జైలుకు వెళ్లాక తిరుపతి శవానికి ఊరి ప్రజలు సమాధి శిక్ష విధించడం.. కట్‌ చేస్తే ఆ వెంటనే అతను ప్రేతాత్మగా పురుడు పోసుకోవడం.. సమాధి నుంచి బయటకొచ్చి నవవధువును అత్యాచారం చేసి హత్య చేయడం.. ఎలిమెంట్స్‌ అన్నీ థ్రిల్లింగ్‌గానే ఉంటాయి. కానీ, ఆ తర్వాత నుంచే కథంతా రొటీన్‌గా మారిపోతుంది. తిరుపతి ఆత్మ పదే పదే ఒకే రీతిలో సమాధిలో నుంచి బయటకొచ్చే తీరు.. నవవధువుల్ని బలి తీసుకునే విధానం అంతా రిపీట్‌ మోడ్‌లో చూస్తున్నట్లే ఉంటుంది. విరామానికి ముందు భైరవి పాత్రను కథలోకి తీసుకొచ్చారు దర్శకుడు. దీనికోసం ఆవుల్ని కాపాడే యాక్షన్‌ సీక్వెన్స్‌తో ఆమెకు ఓ ఎలివేషన్‌ను 


ఏర్పాటు- చేశారు.  ద్వితీయార్ధం పూర్తిగా భైరవి- తిరుపతి ప్రేతాత్మ నేపథ్యంలో సాగుతుంది. కానీ, వీళ్లిద్దరి మధ్య జరిగే పోరులో బలమైన సంఘర్షణ కనిపించదు. 'అరుంధతి’లో పశుపతి భీకర ప్రేతాత్మగా మారడానికి బలమైన బ్యాక్‌స్టోరీ ఉంటుంది. కానీ, దీంట్లో తిరుపతి అంతటి స్థాయి భీకర ప్రేతాత్మగా మారడాన్ని మెచ్చే విధంగా చూపించలేకపోయారు. అలాగే భైరవిగా తమన్నా పాత్రకు ఇచ్చిన ఎలివేషన్‌కు.. ఆ తర్వాత తిరుపతి ప్రేతాత్మతో జరిగే పోరులో ఆమె తలపడే విధానానికి అసలే మాత్రం పొంతన ఉండదు. ఓ మామూలు ప్రేతాత్మ ముందు శివశక్తి అయిన ఆమె పదే పదే నిలువలేకపోవడమన్నది సగటు- ప్రేక్షకుడికి రుచించదు. పతాక సన్నివేశాల్లో భైరవి, తిరుపతి ప్రేతాత్మ మధ్య జరిగే ఓ భీకర పోరు, మాస్‌ మూమెంట్స్‌ ప్రేక్షకుల్ని కాస్త మెప్పిస్తాయి. అయితే కథనంలో బలం లేదన్న తీరు సగటు ప్రేక్షకుడు చర్చించుకోవడం గమనార్హం.
ఇంకా చదవండి: ఓటిటిలోకి రానున్న 'మ్యాడ్‌స్క్వేర్‌'

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# ఓదెల     # అరంధతి