నివిన్ పౌలీ-నయనతార జంటగా రానున్న సరికొత్త సినిమా "డియర్ స్టూడెంట్స్"
2 months ago | 5 Views
లేడీ సూపర్‌స్టార్ నయనతార వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. 'టెస్ట్' , 'మన్నాన్‌గట్టి 1960’ చిత్రాలు పూర్తి చేసిన ఆమె ప్రస్తుతం 'డియర్ స్టూడెంట్స్’ సినిమాతో బిజీ కానుంది. ఇటీవల చిత్ర బృందం ఆమెను సెట్‌లోకి ఆహ్వానించారు. ఈ విషయాన్ని తెలుపుతూ నయన్ ఓ ఫొటో షేర్ చేశారు. కాలేజీ స్టూడెంట్స్ చుట్టూ తిరిగే ఈ వినోదాత్మక చిత్రాన్ని సందీప్ కుమార్, జార్జ్ ఫిలిప్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
నివిన్ పౌలీ కీలక పాత్ర పోషిస్తున్నారు. 'లవ్ యాక్షన్ డ్రామా’ చిత్రం తర్వాత నివిన్, నయన జంటగా నటిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇందులో నయన విద్యా రుద్రన్ అనే టీచర్‌గా కనిపించనున్నటు సమాచారం. ప్రస్తుతం నయన జాబితాలో 'అమ్మోరు 2’, 'తని ఒరువన్ 2’ చిత్రాలున్నాయి.గతేడాది జవాన్, ఇరైవన్, అన్నపూర్ణ చిత్రాలతో అలరించారు నయన్.
ఇంకా చదవండి: సంక్రాంతికి మారిన 'గేమ్‌ఛేంజర్'..డిసెంబర్‌పై కన్నేసిన పలు సినిమాలు!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# DearStudents # Nayanthara # NivinPauly