మిడిల్‌ క్లాస్‌ మహిళగా  నివేదా థామస్‌!

మిడిల్‌ క్లాస్‌ మహిళగా నివేదా థామస్‌!

2 days ago | 9 Views

మలయాళ బ్యూటీ నివేదా థామస్‌ ఈ మధ్య సోషల్‌ విూడియాలో ఒక పోస్ట్‌ పెట్టి వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ’కొంతకాలం గడిచింది.. కానీ.. చివరిగా!’ అంటూ నర్మగర్భంగా పోస్ట్‌లో అక్షరాలను పొందుపరిచింది నివేద. ఇక ఈ పోస్ట్‌ చూసిన కొందరు నెటిజన్లు నివేదా  పెళ్లి చేసుకోబోతుంది అంటూ కామెంట్లు పెట్టగా.. మరికొందరు మూవీ అప్‌డేట్‌ అయ్యింటుందని కామెంట్లు పెట్టారు. అయితే అందరు అనుకున్నట్లుగానే ఈ పోస్ట్‌ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పెట్టినట్లు క్లారిటీ ఇచ్చింది. నివేదా థామస్‌, యువ నటుడు విశ్వదేవ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం '35 చిన్న కథ కాదు' ..ఈ సినిమాకు డెబ్యూ డైరెక్టర్‌ నందకిశోర్‌ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలో నటించబోతున్నారు.

ఈ చిత్రాన్ని సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రానా దగ్గుబాటి సమర్పిస్తుండగా.. సృజన్‌ యరబోలు సిద్దార్థ్‌ రాళ్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదల తేదీని అనౌన్స్‌ చేసిన చిత్రబృందం తాజాగా ఫస్ట్‌ లుక్‌తో పాటు టీజర్‌ అప్‌డేట్‌ ఇచ్చింది. ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ను రానా దగ్గుబాటి సోషల్‌ విూడియా వేదికగా విడుదల చేశారు. ఇక ఈ ఫస్ట్‌ లుక్‌ చూస్తే.. నివేదా థామస్‌ ఇందులో మిడిల్‌ క్లాస్‌ మహిళగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

Priyadarshi's "35-Chinna Katha Kaadu" Heartwarming Teaser Launched -  IndustryHit.Com

ఇంకా చదవండి: వెంకీకు జోడీగా ఐశ్వర్య రాజేష్‌!

# 35ChinnaKathaKaadhu     # NivethaThomas     # Priyadarshi     # TeluguCinema