నితిన్‌-వెంకీ కుడుముల కాంబో..  పోస్టర్‌ విడుదల!

నితిన్‌-వెంకీ కుడుముల కాంబో.. పోస్టర్‌ విడుదల!

6 months ago | 29 Views

టాలీవుడ్‌ హీరో నితిన్‌, వెంకీ కుడుముల కాంబోలో వస్తున్న తాజా చిత్రం 'రాబిన్‌హుడ్‌'. 'భీష్మ' సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే నితిన్‌ పుట్టినరోజు కావడంతో మూవీ నుంచి స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌ తెలిపారు మేకర్స్‌.

ఈ సినిమా నుంచి నితిన్‌కు బర్త్‌డే విషెస్‌ తెలుపుతూ కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. ఇక ఈ పోస్టర్‌లో నితిన్‌ కమాండర్‌ గెటప్‌లో మాస్‌ లుక్‌లో అలరిస్తున్నాడు. అయితే నితిన్‌ ఈ సినిమాలో దొంగగా కనిపించబోతున్నాడు. నటకిరిటీ రాజేందప్రసాద్‌, వెన్నెల కిశోర్‌ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యేర్నేని-రవి శంకర్‌ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు.

ఇంకా చదవండి: హీరో నితిన్, డైరెక్టర్ శ్రీరామ్ వేణు, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఎంటర్‌టైనర్ ‘తమ్ముడు’.. ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ లోగో విడుదల

trending

View More