ఇడ్లీ కొట్టుతో వస్తోన్న నిత్యావిూనన్
2 months ago | 5 Views
ఎంచుకునే ప్రతి పాత్రలోనూ తన సహజమైన నటనతో సినీప్రియుల్ని మెప్పిస్తుంటుంది అందాల తార నిత్యామీనన్. ఇటీవలే ఉత్తమ నటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న ఈమె.. తమిళ కథానాయకుడు ధనుష్‌తో కలిసి 'ఇడ్లీ కడై’ (ఇడ్లీ కొట్టు) అనే చిత్రంలో నటిస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. ‘కొత్త ప్రకటన.. కొత్త ప్రయాణం...'ఇడ్లీకడై‘ అనే వ్యాఖ్యతో సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ఫొటోను పంచుకుంది నిత్య. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమైనట్లు చిత్రవర్గాలు తెలిపాయి.
గ్రావిూణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ధనుష్ తెరకెక్కిస్తున్నారు. డాన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, షాలినీ పాండే తదితరులు నటిస్తున్నారు.'తిరు’ చిత్రంలో స్నేహితులుగా కనిపించి అభిమానుల్ని అలరించిన ధనుష్, నిత్య.. మరి ఈసారి తెరపై ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తారో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ఇంకా చదవండి: టెంపుల్ ట్రెజరీ ఆధారంగా 'నాగబంధం'
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# IdliKadai # Nithyavinan # Dhanush