
రెండో సినిమా ప్రకటించిన నీహారిక.. సంగీత్ శోభన్‌తో తదుపరి చిత్రానికి రెడీ!
5 days ago | 5 Views
మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల తనయ నిహారిక యాంకర్‌గా, హీరోయిన్‌గా, నిర్మాతగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది. హీరోయిన్‌గా నిహారిక చేసిన సినిమా ఒక్కటి హిట్ కాలేదు. దాంతో నిర్మాత అవతారం ఎత్తింది. నిహారిక నిర్మించిన 'కమిటీ కుర్రోళ్లు' సినిమా సంచలన విజయం సాధించింది. ముందుగా హీరోయిన్ గా, తర్వాత వెబ్ సిరీసుల్లో నటించింది కానీ చివరకు నిర్మాతగా స్థిరపడింది. నిహారిక ఇటీవలే చిరంజీవి 'విశ్వంభర' చిత్రంలోని ఓ పాటలో షూటింగ్ లో పాల్గొంది. ఈ పాటలో సాయిధరమ్ తేజ్ కూడా పాల్గొన్నారు. నటిగా మంచి మార్కులు దక్కించుకోలేకపోయిన నిహారిక నిర్మాతగా సత్తా చాటుతుంది. కొత్త డైరెక్టర్, కొత్త నటీనటులతో చిన్న సినిమాగా వచ్చిన 'కమిటీ- కుర్రోళ్లు' చిత్రం 50 కోట్ల వసూళ్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది.. ఇప్పుడు నిహారిక నిర్మాతగా రెండో సినిమాతో పలకరించబోతుంది. తన రెండు సినిమాని అధికారికంగా ప్రకటించింది.
ఈ సినిమాలో ఫుల్ ఫామ్ లో ఉన్న నటుడు సంగీత్ శోభన్ హీరోగా నటించబోతున్నాడు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో పాటు- ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, 3 రోజెస్.. పలు సిరీస్ లతో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న సంగీత్ ఇందులో మెయిన్ లీడ్ పోషించబోతున్నాడు. సంగీత్ సోలో హీరోగా నటించనున్న తొలి సినిమా ఇదే. ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ ఇద్దరు గతంలో నిహారికతో కలిసి పని చేశారు. నిహారిక రూపొందించిన వెబ్ ప్రాజెక్ట్స్‌లో హీరో సంగీత్ శోభన్, డైరెక్టర్ మానస శర్మ భాగం అయ్యారు. జీ5తో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ రూపొందించిన వెబ్ సిరీస్ ’ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి మానస శర్మ రచయితగా పని చేశారు. ’ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’లో సంగత్ శోభన్ ప్రధాన పాత్ర పోషించారు.
ఇక సోనీ లివ్ రూపొందించిన ’బెంచ్ లైఫ్’కి మానస శర్మ దర్శకురాలిగా పని చేశారు. గతంలో ఈ ముగ్గురు కలిసి అద్భుతాలు చేయగా, ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ ప్రాజెక్ట్‌కి మానస శర్మ కథను అందించగా మహేష్ ఉప్పల కో రైటర్‌గా స్కీన్ర్ ప్లే, డైలాగ్స్ అందించారు. మన్యం రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు
ఇంకా చదవండి: సిద్దార్థ్....భాస్కర్ మధ్య గ్యాప్.. అదంతా సినిమాలో మామూలే అని వివరణ
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!