
నిహాల్ కోధాటి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల – ‘చైనా పీస్’ నుంచి వాలిగా ఏకధాటిగా!
3 days ago | 5 Views
నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా 'చైనా పీస్'. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్ర పోషించారు.
మేకర్స్ ఈ రోజు వాలి పాత్రలో నిహాల్ కోధాటి ని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. నిహాల్ ని ఇంటెన్స్ లుక్ లో ప్రజెంట్ చేసి ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఆసక్తిని పెంచింది.
ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ సురేష్ రగుతు అందిస్తుండగా సంగీతం కార్తీక్ రోడ్రిగ్జ్ సమకూరుస్తున్నారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్.
ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే మేకర్స్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు.
నటీనటులు: నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్, హర్షిత బండ్కమూరి, కమల్ కామరాజు, గులాసీ, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్.
టెక్నికల్ టీం:
రచన, దర్శకత్వం: అక్కి విశ్వనాధ రెడ్డి
బ్యానర్: మూన్ లైట్ డ్రీమ్స్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సురేష్ రగుతు
సంగీతం: కార్తీక్ రోడ్రిగ్జ్
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
పీఆర్వో: తేజస్వీ సజ్జా
ఇంకా చదవండి: 'లవ్ యువర్ ఫాదర్' ఫస్ట్ టికెట్ కొన్న కిషన్ రెడ్డి! ఏప్రిల్ 4 న విడుదల
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# చైనా పీస్ # నిహాల్ కోధాటి # సూర్య శ్రీనివాస్