దసరాకు సై అంటున్న కొత్త చిత్రాలు

దసరాకు సై అంటున్న కొత్త చిత్రాలు

2 months ago | 5 Views

దసరాకు  పలు సినిమాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి.  అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ సినిమా అంటే అటు తమిళంతో పాటు, ఇటు తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తారు. 'జైలర్‌’ విజయం తర్వాత రజనీ నటిస్తున్న మరో యాక్షన్‌ డ్రామా చిత్రం 'వేట్టయాన్‌’. 'జై భీమ్‌’ వంటి సోషల్‌ మెసేజ్‌ మూవీతో ప్రేక్షకులను అలరించిన టి.జె.జ్ఞానవేల్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబరు 10న విడుదల కానుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీలో అమితాబ్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌ కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్‌ సంగీతం అందించారు. 


పసందైన వినోదంతో పాటు అన్ని రకాల మసాలాలు అద్దుకుని పక్కా కమర్షియల్‌ ప్యాకేజ్‌గా కనిపిస్తుంటాయి దర్శకుడు శ్రీను వైట్ల సినిమాలు. ఒకప్పుడు వరుస విజయాలతో బాక్సాఫీస్‌ ముందు జోరు చూపించిన ఆయన.. ఆరేళ్ల విరామం తర్వాత 'విశ్వం’తో అలరించేందుకు సిద్ధమయ్యారు. గోపీచంద్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్‌, వేణు దోనేపూడి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబరు  11న విడుదలవుతోంది. కావ్య థాపర్‌ కథానాయిక. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు చూస్తే.. కామెడీ, యాక్షన్‌ మేళవించి మూవీని తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. దసరా బరిలో 'మార్టిన్‌’తో అలరించనున్నారు ధ్రువ సర్జా . ఆయన హీరోగా నటించిన ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని ఎ.పి.అర్జున్‌ తెరకెక్కించారు. వైభవి శాండిల్య కథానాయిక. ఈ సినిమా అక్టోబరు 11న విడుదల కానుంది. ’ప్రేక్షకుడు ఎంత ఊహించుకుని వచ్చినా..దానికంటే ఎక్కువగానే ఉంటుంది ఈ సినిమా. చాలా విరామం తర్వాత ఇలాంటి కమర్షియల్‌ సినిమా వస్తోంది’ అని చిత్ర బృందం చెబుతోంది.

అలియా భట్‌, వేదాంగ్‌ రైనా ప్రధాన పాత్రల్లో వాసన్‌ బాలా తెరకెక్కించిన చిత్రం ’జిగ్రా’. ధర్మ ప్రొడక్షన్స్‌, వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ఎటర్నల్‌ ్గªన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు నిర్మించాయి. ఇది అక్టోబరు 11న థియేటర్లలోకి రానుంది. తెలుగులో ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రానా దగ్గుబాటి విడుదల చేస్తున్నారు. 'ఈ కథలో మంచి సోల్‌ ఉంది. భాషతో సంబంధం లేకుండా ఎవరికైనా ఇట్టే కనెక్ట్‌ అయిపోతుంది. యాక్షన్‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌ మేళవింపుతో రూపొందిన చిత్రమిది. కచ్చితంగా ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని పంచుతుంది’ అని చిత్ర బృందం చెబుతోంది.


సుధీర్‌ బాబు కథానాయకుడిగా అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మా నాన్న సూపర్‌ హీరో’. ఆర్ణ కథానాయిక. షాయాజీ షిండే కీలక పాత్రలో కనిపించనున్నారు. దసరా కానుకగా అక్టోబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడంతో అంచనాలు నెలకొన్నాయి.


ఈ దసరాకి ’జనక అయితే గనక’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు నటుడు సుహాస్‌. సంకీర్తన కథానాయక. ఈ చిత్రాన్ని దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. సందీప్‌ బండ్ల దర్శకత్వం వహించారు. అక్టోబరు 12న ఈ మూవీ విడుదల కానుంది.  ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రలా మూవీని తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది.

Read Also: ఓదెల విలేజ్ లో తమన్నా భాటియా 'ఓదెల 2' ఫైనల్ షెడ్యూల్ షూటింగ్

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# Viswam     # Gopichand     # Vettaiyan     # Rajinikanth    

trending

View More