ఓటీటీ లో విడుదల అయిన సరికొత్త హారర్‌ థ్రిల్లర్‌ మూవీ 'బ్లడీ ఇష్క్‌'

ఓటీటీ లో విడుదల అయిన సరికొత్త హారర్‌ థ్రిల్లర్‌ మూవీ 'బ్లడీ ఇష్క్‌'

4 months ago | 84 Views

అవికా గోర్‌, వర్ధన్‌ పూరి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ’బ్లడీ ఇష్క్‌’. ఓటీటీ ’డిస్నీహాట్‌స్టార్‌’లో ఈ మూవీ శుక్రవారం విడుదలైంది. థియేటర్లలో విడుదలే లక్ష్యంగా రూపొందినప్పటికీ కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్‌ కావడం గమనార్హం. ఆ జాబితాలోదే ’బ్లడీ ఇష్క్‌’ చేరింది. అవికా గోర్‌, వర్ధన్‌ పూరి ప్రధాన పాత్రల్లో విక్రమ్‌ భట్‌ తెరకెక్కించిన చిత్రమిది.అనగనగా ఓ ఐలాండ్‌. అక్కడ ఇంద్రభవనం లాంటి ఇల్లు. ఆ ఇంట్లో రోమేశ్‌, నేహా దంపతులు (వర్ధన్‌ పూరి, అవికా గోర్‌) మాత్రమే ఉంటారు. భర్తతో ఉన్నప్పుడు ధైర్యంగానే ఉన్నా ఒంటరిగా ఉంటే మాత్రం నేహా భయపడిపోతుంటుంది. ఆ బంగ్లాలో ఏదో ఉందని అనుమానించే నేహాకు అందుకు తగ్గట్టే రాత్రి వేళ విచిత్రమైన శబ్దాలు వినిపిస్తుంటాయి. దీంతో, అదృశ్య శక్తి అదంతా చేస్తోందా? ఈ ఘటన వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అనే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తుంది. ఇదే విషయాన్ని తన భర్తకు చెప్పగా అతడు మెల్లగా టాపిక్‌ను డైవర్ట్‌ చేస్తుంటాడు. రోమేశ్‌ అసలు విషయాన్ని దాచిపెట్టడానికి కారణమేంటి? నేహా ఊహించినట్టు అక్కడ దెయ్యం ఉందా? రోమేశ్‌ తండ్రి (రాహుల్‌ దేవ్‌), ఆయనకు కాబోయే రెండో భార్య (జెన్నీఫర్‌ పిచినటో) చావుకు కారకులెవరు? రోమేశ్‌ ఫ్యామిలీ గురించి పూర్తిగా తెలుసుకున్న నేహా చివరకు ఏం చేసిందనేది చిత్ర కథ. ఎడిటింగ్‌ టేబుల్‌ వద్దే సినిమా ఫలితం తెలిసిపోతుంది’ అంటుంటారు సినీ పండితులు. అలా ’బ్లడీ ఇష్క్‌’ టీమ్‌ జాగ్రత్తపడి స్టెయ్రిట్‌గా ఓటీటీలో రిలీజ్‌ చేసినట్టుంది.

’హారర్‌ థ్రిల్లర్‌’ అంటూ ఈ సినిమాని ప్రచారం చేయడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే, మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా అక్రమ సంబంధం చుట్టూ అల్లుకున్న కథను హారర్‌ కోణంలో చూపించారు. పెళ్లికి ముందు తన భర్త చేసిన తప్పిదం గురించి తెలిసిన భార్య ఎలాంటి నిర్ణయం తీసుకుందనేది క్లుప్తంగా ఈ సినిమా కథాంశం. నేపథ్య సంగీతంతో కొంతమేరకు ఉత్కంఠ క్రియేట్‌ చేయగలిగారు. హీరోయిన్‌ ప్రాణాపాయ స్థితిలో ఉండే ఎంట్రీ సీన్‌ ఏం జరిగిందోనన్న ఆసక్తి రేకెత్తించినా తర్వాత ’ఇందులో ఏం లేదు’ అనే సంగతి ప్రేక్షకుడి అర్థమైపోతుంది. హీరోయిన్‌ గతమేంటో చెప్పే క్రమంలో తరచూ ప్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌ చూపించడంతో గందరగోళం నెలకొంది. తెరపై కనిపించేది తక్కువ పాత్రలే అయినా క్లారిటీ మిస్‌ అయింది. ఆ ఇంట్లో ఏదో ఉందని హీరోయిన్‌ అనడం.. హీరో మేనేజ్‌ చేయడం.. అతడు చెప్పింది తప్పని తెలుసుకున్న హీరోయిన్‌ ఫీలవడం.. ఈ సీక్వెన్స్‌తోనే ఫస్టాఫ్‌ పూర్తవుతుంది. అసలే సాగదీత అనుకుంటే మధ్యలో పాటలు ఇరికించి, ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టారు. ఆ క్రమంలోనే రోమేశ్‌ తండ్రి, ఆయనకు కాబోయే రెండో భార్య ప్రస్తావన, లవ్‌` లస్ట్‌కు మధ్య తేడా ఏంటో దర్శక, రచయితలు తమదైన శైలిలో వివరించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి హిందీ ఆడియో మాత్రమే అందుబాటులో ఉంది.హారర్‌ టచ్‌ ఉన్న కథల్లో నటించడం అవికా గోర్‌కు కొత్తేవిూ కాదు. ’రాజుగారి గది 3’, ’1920: హారర్స్‌ ఆఫ్‌ ది హార్ట్‌’ వంటి సినిమాలతో థ్రిల్‌ పంచిన ఆమె ఇందులో నేహాగా మెప్పిస్తారు. వర్ధన్‌ పూరి యాక్టింగ్‌ ఓకే. స్క్రీన్‌ ప్రెజెన్స్‌ వీరికే ఎక్కువ. హీరో తండ్రిగా రాహుల్‌ దేవ్‌ అతిథిగా మెరిశారు. జెన్నీఫర్‌ పిచినటో గ్లామర్‌ పాత్రలో కనిపిస్తారు.

ఇంకా చదవండి: అక్టోబర్‌ 4న జపాన్‌లో 'హనుమాన్‌' విడుదల

# BloodyIshq     # AvikaGor     # VardhaanPuri    

trending

View More