బాక్సాఫీస్‌కు తిరిగి కొత్త ఉత్సాహం !

బాక్సాఫీస్‌కు తిరిగి కొత్త ఉత్సాహం !

4 days ago | 15 Views

మాహిష్మతీ ఊపిరి పీల్చుకో... అన్నట్టుగా కొన్నాళ్లుగా సరైన సినిమాలు లేక డీలా పడిన భారతీయ బాక్సాఫీస్‌కు తిరిగి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది ప్రభాస్‌ 'కల్కి 2898 ఏడి’. మన దేశంలోనే కాదు, విదేశాల్లోనూ కొన్ని రోజులుగా సినీ ప్రియులు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. కథానాయకుడు ప్రభాస్‌కీ, ’కల్కి’ సినిమాకీ ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తికి అద్దం పట్టే విషయమది. అత్యంత భారీ బడ్జెట్‌తో దాదాపు రూ.600 కోట్లతో రూపొందిన సినిమా ఇది. సైన్స్‌ ఫిక్షన్‌, హిందూ పురాణాలు, భవిష్యత్‌ కాలం, అగ్ర తారాగణం... మేళవింపుగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ప్రముఖంగా ఆకర్షించింది. ఎప్పుడెప్పుడా అని విడుదల కోసం ఎదురు చూసేలా చేసింది. ఈ సినిమా నిర్మాణం వెనక ఎన్నో విశేషాలు ఉన్నాయి. సినిమాలో కీలకమైన ఓ పాత్రగా కనిపించే బుజ్జి కార్‌ కోసమే రూ.6 కోట్లు పైగా ఖర్చు చేశారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సందడి చేసిన ఆ కార్‌ సినిమా ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించింది.

ఓ ఇంజినీరింగ్‌ అద్భుతం అంటూ ఆ కార్‌ని పలువురు ప్రముఖులు మెచ్చుకున్నారు. బుజ్జి కార్‌కి అగ్ర కథానాయిక కీర్తి సురేశ్‌ గొంతునిచ్చారు. ఈ సినిమా కోసం భవిష్యత్‌ కాశీ, కాంప్లెక్స్‌, శంబల అనే మూడు  ప్రపంచాల్ని సృష్టించారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. ఆ మూడు ప్రపంచాల నేపథ్యంలోనే ఈ కథ సాగుతుంది. తారాగణం పరంగానూ ఎన్నో విశేషాలున్న చిత్రమిది. అశ్వత్థామగా నటించిన అమితాబ్‌, సుప్రీం  యాస్కిన్‌ పాత్రని పోషించిన కమల్‌హాసన్‌ దాదాపు 39 ఏళ్ల విరామం తర్వాత  కలిసి ఇందులో నటించారు. దీపికా పదుకొణె నటించిన తొలి తెలుగు చిత్రమిదే. పాన్‌ ఇండియా చిత్రాల సంచలనం ప్రభాస్‌ నుంచి ’సలార్‌’ తర్వాత వస్తున్న చిత్రమిది. శోభన, దిశా పటానీ, మాళవిక నాయర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ అతిథి పాత్రల్లో మెరవనున్నారు. నాని, మృణాల్‌ ఠాకూర్‌ తదితరులు నటించారని, ఇందులో శ్రీకృష్ణుడి పాత్రలో మరో అగ్ర నటుడు తెరపై సందడి చేస్తారని ప్రచారం సాగుతూ వచ్చింది.

అగ్ర నటులు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌లు మళ్లీ ఇన్నాళ్లకి కలిసి ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తుండడం అందరి దృష్టినీ ప్రముఖంగా ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో వాళ్ల గెటప్పులు మరింతగా ఆకర్షిస్తున్నాయి. అశ్వత్థామ పాత్రలో కనిపించనున్న అమితాబ్‌ బచ్చన్‌... ఆ గెటప్‌ కోసమే రోజూ ఐదు గంటలు కేటాయించాల్సి వచ్చేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సుప్రీం యాస్కిన్‌ పాత్రలో కమల్‌హాసన్‌ అవతారం కూడా ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. లాస్‌ ఏంజెలిస్‌లో హాలీవుడ్‌ మేకప్‌ నిపుణుల సమక్షంలో ఆయన గెటప్‌ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.

ఇంకా చదవండి: భారతీయ సినిమాకు మరో ఆణిముత్యం.. విజువల్‌ వండర్‌గా ’కల్కి 2898 ఏడీ’

# Kalki2898AD     # Prabhas     # DeepikaPadukone     # KamalHaasan     # DishaPatani    

trending

View More