
చిరంజీవి తో నాని చిత్ర నిర్మాణం... 'కోర్ట్' సినిమా అద్భుతంగా ఉంటుందని వెల్లడి
1 month ago | 5 Views
చిరంజీవి కథానాయకుడిగా నాని ఓ సినిమా నిర్మించనున్నారు. ’దసరా’ ఫేం శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నానితో 'ప్యారడైజ్’ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తయ్యాక చిరంజీవి సినిమా మొదలుపెట్టే అవకాశం ఉందని చాలాకాలంగా టాక్ నడుస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి నిర్మాతగా నాని ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది చిత్రీకరణ ప్రారంభించుకోనుందని నాని స్వయంగా వెల్లడించారు. ఇటీవల జరిగిన ’కోర్ట్’ సినిమా కార్యక్రమంలో నాని మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. ప్రియదర్శి ప్రధాన పాత్రలో రామ్ జగదీశ్ దర్శకుడిగా నాని సమర్పణలో 'కోర్ట్’ సినిమా తెరకెక్కింది. ప్రశాంతి తిపిర్నేని నిర్మాత. హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
ఈ నేపథ్యంలో నాని ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. హైదరాబాద్‌లో ఫస్ట్ హియరింగ్ విత్ విూడియా పేరుతో ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి సినిమా విశేషాలు చెప్పుకొచ్చారు.'అందమైన ప్రేమకథ.. బలమైన డ్రామా.. గొప్ప సందేశం.. అన్నీ ఉన్న చిత్రం 'కోర్ట్: ది స్టేట్ వర్సెస్ నోబడీ’. దీని విషయంలో నేను అందరికీ ఓ మాట ఇస్తున్నా. సినిమా పూర్తయ్యే సరికి థియేటర్లలో ఉన్న ప్రతి ఒక్కరూ కచ్చితంగా లేచి నిలబడి చప్పట్లు కొడతారని నమ్ముతున్నానని అన్నారు కథానాయకుడు నాని. ఆయన సమర్పణలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీశ్ తెరకెక్కించారు. హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. శివాజి, సాయికుమార్, హర్ష వర్ధన్, రోహిణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాలో స్పృశించిన అంశం చాలా సున్నితమైనది. ఇలాంటి కథలు చెప్పేటప్పుడు చిన్న ఒత్తు, పొల్లు కూడా పక్కకు పోకూడదు. అందుకే దర్శకుడు జగదీశ్ దీనికోసం చాలా రీసెర్చ్ చేశాడు. అలాగే హర్ష-శ్రీదేవి నటన.. వాళ్ల అందమైన ప్రేమకథ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా పూర్తయ్యే సరికి తప్పకుండా అందరికీ పోక్సో చట్టం గురించి ఓ అవగాహన వస్తుంది.
ఇది తప్పకుండా పెద్ద బ్లాక్‌బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని వాస్తవ సంఘటనల్ని.. దాని తాలూకూ కేసుల్ని ఆధారం చేసుకుని ఫిక్షనల్‌గా ఈ చిత్ర కథను అల్లుకున్నాం. నాని నిర్మాణంలో చేయడం వల్ల ఇది మరింత ఎక్కువ మందికి చేరువ చేసే అవకాశం దొరికింది. పోక్సో చట్టానికి సంబంధించిన ఓ సున్నిత అంశాన్ని ఈ సినిమాలో చర్చించనున్నామని అన్నారు దర్శకుడు రామ్ జగదీశ్. నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ.. నాకు కోర్టు రూం డ్రామా చిత్రాలంటే చాలా ఇష్టం. ఈ కథ విన్నప్పుడు అందరికీ స్ఫూర్తినిచ్చే సినిమా అవుతుందనిపించింది. దీన్ని చూశాక తప్పకుండా న్యాయ వ్యవస్థపైనా.. న్యాయవాదులపైనా గౌరవం రెట్టింపవుతుందని నమ్ముతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో హర్ష్ రోషన్, దీప్తి గంటా, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
ఇంకా చదవండి: టాలీవుడ్‌లోకి సోనుధి ఫిల్మ్ ఫ్యాక్టరీ ఎంట్రీ!
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# కోర్ట్ # చిరంజీవి # నాని # ప్రియదర్శి