నాని హిట్ 3 ట్రైలర్ లాంచ్: “కొత్త జోనర్‌లో ఇంపాక్ట్ ఫుల్ యాక్షన్ సినిమా. మే 1న థియేటర్స్‌లో కలుద్దాం.”

నాని హిట్ 3 ట్రైలర్ లాంచ్: “కొత్త జోనర్‌లో ఇంపాక్ట్ ఫుల్ యాక్షన్ సినిమా. మే 1న థియేటర్స్‌లో కలుద్దాం.”

8 days ago | 5 Views

విట్నెస్ అర్జున్ సర్కార్ మ్యాన్‌హంట్- నేచురల్ స్టార్ నాని, శైలేష్ కొలను, వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ 'హిట్: ది 3rd కేస్'  మోస్ట్ ఇంటెన్స్ ట్రైలర్ లాంచ్ 

నేచురల్ స్టార్ నాని తన అప్ కమింగ్ హిట్: ది 3rd కేస్‌లో మోస్ట్ ఇంటెన్స్ అండ్ వైలెంట్ అవతార్ లో కనిపించనున్నారు. ఈ సినిమా గ్లింప్స్, టీజర్, పాటలు, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌ ట్రెమండస్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ఈరోజు వైజాగ్ సంగమ్ థియేటర్ లో భారీగా తరలివచ్చిన అభిమానులు సమక్షంలో లాంచ్ చేశారు. 

ట్రైలర్ నాని క్యారెక్టర్ అర్జున్ సర్కార్‌కు ఫెరోషియస్ టోన్ సెట్ చేసే గ్రిప్పింగ్ సీక్వెన్‌తో ప్రారంభమవుతుంది. క్రిమినల్స్ వుంటే భూమి మీద 10 ఫీట్ సెల్ లో వుండాలి లేదా భూమిలో 6 ఫీట్ హోల్ లో వుండాలి' అంటూ నాని చెప్పిన గ్రిప్పింగ్ డైలాగ్ అదిరిపోయింది. 9 నెలల పాప కిడ్నాప్ తో కథ ప్రారంభమవుతుంది. అర్జున్ కేసును బాధ్యతగా తీసుకుంటాడు. అతను నేరస్థుల అండర్ వరల్డ్ లోకి వెళ్లి కనికరంలేని మ్యాన్ హంట్ చేస్తాడు. న్యాయం కోసం తన మార్గంలో, అర్జున్ క్రూరమైన ప్రతీకారం తీర్చుకుంటాడు, నేరస్థులను అత్యంత హింసాత్మకమైన, క్షమించరాని మార్గాల్లో ఉరితీస్తాడు.

ఇది నానికి ఇప్పటివరకూ మోస్ట్ ఇంటెన్స్ అండ్ వైలెంట్ క్యారెక్టర్. అర్జున్ సర్కార్ గా నాని బాడీ లాంగ్వేజ్, డిక్షన్, స్టన్నింగ్ ప్రజెన్స్ కట్టిపడేశాయి. సర్కార్ క్రిమినల్స్ పై చేసే పోరాటంలో కనికరం లేని వాడిగా కనిపిస్తాడు. కానీ తన వ్యక్తిగత జీవితంలో సున్నితమైన వ్యక్తిగా కనిపిస్తాడు. ఇది అతని పాత్రలో వైవిధ్యాన్ని చూపిస్తోంది. చివరి సన్నివేశాలు ఉత్కంఠగా సాగుతాయి. నాని ఫెరోషియస్ ఎంగర్ అద్భుతంగా ప్రజెంట్ చేశారు. శ్రీనిధి శెట్టి అర్జున్ లవర్ గా ఆకట్టుకుంది. 


డైరెక్టర్ శైలేష్ కొలను HIT: The 3rd Case తో  క్రైమ్ థ్రిల్లర్లలో మాస్టర్‌ అనిపించుకున్నారు. ఎమోషనల్ గా టెక్నికల్ గా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ని అందించారు. థర్డ్ పార్ట్  నిస్సందేహంగా అతని బెస్ట్ రైటింగ్, ఎక్సయిటింగ్ డైరెక్షన్ బ్లెండ్. నానిని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని అవతార్‌లో ప్రజెంట్ చేశారు. ప్రతి విభాగం నుండి అద్భుతమైన పనిని రాబట్టడంలో విజయం సాధించారు.   

విజువల్ గా సినిమా స్టన్నింగ్ గా వుంది.  సినిమాటోగ్రాఫర్ సాను జాన్ వర్గీస్  మ్యాజిక్ క్రియేట్ చేశారు. అతని విజువల్స్ కథనాన్ని మరో స్థాయికి తీసుకువెళుతుంది. ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ ఆర్, ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర తంగాల వండర్ ఫుల్ వర్క్ అందించారు. మిక్కీ జె మేయర్ ఇంటెన్స్ నేపథ్య సంగీతం ఎక్సయిట్మెంట్ పెంచుతుంది. "అబ్కీ బార్" థీమ్ మరింత బలాన్ని తెచ్చింది వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్  నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. ట్రైలర్ ఆకాశాన్ని తాకే అంచనాలను క్రియేట్ చేసింది. HIT: ది 3rd కేస్ మే 1న థియేటర్లలో విడుదల కానుంది. 

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. వైజాగ్ రావడం ఎప్పుడు స్పెషల్ గా ఉంటుంది. హిట్ 3 మనకు ఎప్పుడూ అలవాటు లేని ఒక కొత్త జోనర్ లో చేసిన సినిమా. కొత్తగా   ఇంపాక్ట్ ఫుల్ గా చేసిన ప్రతిసారి తెలుగు ఆడియన్స్ చాలా గొప్పగా ఆదరించారు. దానికి వందలు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంకొక్కసారి మే1కి  మీరు నేను కలిసి గెలుస్తామని నమ్మకం నాకుంది. ఇలాంటి సెలబ్రేషన్స్ మనందరం కలిసి చాలా చాలా చేసుకోవాలి. నాని యాక్షన్ సినిమాలో చేయాలని కోరుకునే వారంతా మే 1న థియేటర్స్ కి వచ్చేయండి. ఈ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా లవ్ యు. మే1 కి మ్యాడ్ నెస్ ఉంటుంది. ఇట్స్ మై ప్రామిస్'అన్నారు. 

తారాగణం: నాని, శ్రీనిధి శెట్టి

సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: డా. శైలేష్ కొలను

నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని

బ్యానర్లు: వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్

డీవోపీ: సాను జాన్ వర్గీస్

సంగీతం: మిక్కీ జె మేయర్

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్

ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ వెంకటరత్నం (వెంకట్)

సౌండ్ మిక్స్: సురేన్ జి

లైన్ ప్రొడ్యూసర్: అభిలాష్ మాంధదపు

చీఫ్ కో-డైరెక్టర్: వెంకట్ మద్దిరాల

కాస్ట్యూమ్ డిజైనర్: నాని కమరుసు

SFX: సింక్ సినిమా

VFX సూపర్‌వైజర్: VFX DTM

DI: B2h స్టూడియోస్

కలరిస్ట్: S రఘునాథ్ వర్మ

పీఆర్వో: వంశీ శేఖర్

మార్కెటింగ్: ఫస్ట్ షో

ఇంకా చదవండి: ఆహా ఓటీటీలో 100 మిలియన్ ఫ్లస్ మినిట్స్ వ్యూయర్ షిప్ సాధించిన 'హోం టౌన్' వెబ్ సిరీస్

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# హిట్3     # నాని     # శ్రీనిధి శెట్టి