'నాగబంధం' ప్రీ-లుక్ విడుదల: జనవరి 13న రుద్రను పరిచయం
17 hours ago | 5 Views
పాషనేట్ ఫిల్మ్ మేకర్ అభిషేక్ నామా ప్రతిష్టాత్మకమైన, లార్జ్ లెవల్ ప్రాజెక్ట్ 'నాగబంధం'తో తన క్రాఫ్ట్ ని ఎలివేట్ చేస్తున్నారు. అభిషేక్ దర్శకత్వం వహించడమే కాకుండా కథ, స్క్రీన్‌ప్లేకు తన క్రియేటివ్ టచ్‌ని అందించారు, ఇది ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది. అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి ఎన్‌ఐకె స్టూడియోస్‌పై కిషోర్ అన్నపురెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్ మూవీ పెదకాపుతో ఆకట్టుకున్న విరాట్ కర్ణ లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఈ చిత్రం తారక్ సినిమాస్ సహ-నిర్మాణంలో లక్ష్మీ ఐరా, దేవాన్ష్ నామా ఈ హై బడ్జెట్ ప్రాజెక్ట్‌ను సగర్వంగా ప్రజెంట్ చేస్తున్నారు.
ఈరోజు, మేకర్స్ ప్రీ-లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు, హీరో పురాతన ఆలయం పెద్ద తలుపు ముందు నిలబడి ఉన్నట్లు కనిపిస్తుంది. తలుపు కొద్దిగా తెరుచుకున్నందున, లోపల నుండి కాంతి ప్రసరిస్తుంది, ప్రాజెక్ట్ గొప్పతనాన్ని సూచిస్తుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న రుద్రను పరిచయం చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.
'నాగబంధం'లో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ, బి.ఎస్. అవినాష్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. .
పద్మనాభస్వామి, పూరీ జగన్నాథ దేవాలయాల వద్ద ఇటీవల కనుగొనబడిన గుప్త నిధుల నుండి ప్రేరణ పొంది, ఆధ్యాత్మిక సాహసోపేతమైన ఇతివృత్తాలతో అభిషేక్ నామా గ్రిప్పింగ్ స్క్రిప్ట్‌ను రాశారు. ఈ పవిత్ర స్థలాలను రక్షించే నాగబంధం పురాతన ఆచారాలపై దృష్టి సారించి, భారతదేశంలోని 108 విష్ణు దేవాలయాల చుట్టూ ఉన్న రహస్యాన్ని నాగబంధం అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నారు.
సినిమా ఇంట్రో వీడియో ఇప్పటికే ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది, మంత్రముగ్దులను చేసే ప్రపంచంలోని గ్లింప్స్ అందిస్తుంది. KGF ఫేం అవినాష్ అఘోరా పాత్రలో నటిస్తున్నాడు. గొప్ప విజన్‌తో, నాగబంధం అసాధారణమైన నిర్మాణ విలువలు, అత్యాధునిక VFX హై -ఆక్టేన్ అడ్వంచర కి ప్రామిస్ చేస్తోంది.
ఈ చిత్రానికి సౌందర్ రాజన్ ఎస్ డీవోపీగా పని చేస్తున్నారు, అభే సంగీత దర్శకుడు. కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ రాయగా, సంతోష్ కామిరెడ్డి ఎడిటర్. అశోక్ కుమార్ ప్రొడక్షన్ డిజైనర్.
100 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న నాగబంధం 2025లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో పాన్ ఇండియా విడుదలకు సిద్ధంగా వుంది.
తారాగణం: విరాట్ కర్ణ, నభా నటేష్, ఈశ్వర్య మీనన్, జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ, బి.ఎస్. అవినాష్
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: NIK స్టూడియోస్ & అభిషేక్ పిక్చర్స్
సమర్పణ: లక్ష్మి ఐరా & దేవాన్ష్
కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: అభిషేక్ నామా
నిర్మాత: కిషోర్ అన్నపురెడ్డి
సహ నిర్మాత: తారక్ సినిమాస్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్
సంగీతం: అభే
సీఈవో: వాసు పోతిని
ప్రొడక్షన్ డిజైనర్: అశోక్ కుమార్
డైలాగ్స్: కళ్యాణ్ చక్రవర్తి
ఎడిటర్: RC పనవ్
కాస్ట్యూమ్ డిజైనర్: అస్విన్ రాజేష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అభినేత్రి జక్కల్
యాక్షన్: వెంకట్, వ్లాడ్ రింబర్గ్
స్క్రిప్ట్ డెవలప్‌మెంట్: శ్రా1, రాజీవ్ ఎన్ కృష్ణ
Vfx: థండర్ స్టూడియోస్
Vfx సూపర్‌వైజర్: దేవ్ బాబు గాండి (బుజ్జి)
పబ్లిసిటీ డిజైన్స్: కాని స్టూడియో
ఇంకా చదవండి: యష్ బర్త్ డే సందర్భంగా ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ బర్త్ డే పీక్ రిలీజ్..వైల్డ్ లుక్‌లో ఆకట్టుకుంటోన్న రాకింగ్ స్టార్
"Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!"
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# నాగబంధం # అభిషేక్ నామా # నభా నటేష్