టెంపుల్ ట్రెజరీ ఆధారంగా 'నాగబంధం'
2 months ago | 5 Views
'పెదకాపు’ చిత్రంతో పరిచయమైన విరాట్‌కర్ణ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’. నభా నటేశ్ కథానాయిక. అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, తారక్ సినిమాస్ సంస్థలతో కలిసి ఎన్.ఐ.కె.స్టూడియోస్ పతాకంపై కిశోర్ అన్నపురెడ్డి నిర్మిస్తున్నారు. లక్ష్మీ ఐరా, దేవాన్ష్ నామా సమర్పకులు. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. అగ్ర కథానాయకుడు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌నిచ్చారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు అజయ్ భూపతి గౌరవ దర్శకత్వం వహించారు. ఏషియన్ సునీల్ చిత్రబృందానికి స్క్రిప్ట్‌ని అందజేశారు. తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి ఆలయంలో నిధి, పూరి జగన్నాథ ఆలయంలో రత్న భాండాగారాన్ని తెరిచిన తర్వాత గుప్తనిధుల అంశం చర్చనీయాంశంగా మారింది.
నాగబంధం రక్షణలో ఉన్న అలాంటి 108 దేవాలయాలతో ముడిపడిన కథ ఇది. భక్తి, సాహసాలు, అంతుచిక్కని రహస్యాలతో ఓ శక్తిమంతమైన కథని తయారు చేశారు అభిషేక్ నామా. ఈ నెల 23 నుంచే రెగ్యులర్ చిత్రీకరణని ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది తెలుగుతోపాటు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తామని సినీ వర్గాలు తెలిపాయి. కథానాయకుడు విరాట్‌కర్ణ మాట్లాడుతూ ఈ సినిమా చాలా బాగుంటుంది. చిరంజీవి చేతులవిూదుగా ప్రారంభం కావడం ఆనందంగా ఉందని అన్నారు. ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, జయప్రకాశ్, మురళీశర్మ, బి.ఎస్.అవినాశ్ తదితరులు నటిస్తున్నారు.
ఇంకా చదవండి: పోస్టర్లు..టీజర్.. ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# Nagabandham # ViratKarrna # NabhaNatesh # October23