నాగ చైతన్య కొత్త సినిమా ప్రకటన! #NC24, కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించారు.

నాగ చైతన్య కొత్త సినిమా ప్రకటన! #NC24, కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించారు.

1 month ago | 5 Views

స్టార్‌ హీరో అక్కినేని నాగచైతన్య కొత్త సినిమాను అనౌన్స్‌ చేశాడు. సాయి ధరమ్‌ తేజ్‌కి విరుపాక్ష లాంటి బ్లాక్‌ బస్టర్‌ను అందించిన దర్శకుడు కార్తీక్‌ వర్మ దర్శకత్వంలో చైతూ సినిమా చేయబోతున్నాడు.  నాగ చైతన్య పుట్టినరోజు కానుకగా  ఈ ప్రాజెక్ట్‌ను ఆఫీషియల్‌గా అనౌన్స్‌ చేశారు. ఈ సందర్భంగా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఎన్‌సీ24 అనే వర్కింగ్‌ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం సూపర్‌ న్యాచురల్‌ థ్రిల్లర్‌గా రాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేను తీసుకోబోతున్నారని టాక్‌ నడుస్తుంది.

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌లపై బోగవల్లి ప్రసాద్‌తో పాటు సుకుమార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరోవైపు గతేడాది 'కస్టడీ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చైతూ భారీ డిజాస్టర్‌ను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం అతడి ఆశలన్ని 'తండేల్‌' చిత్రంపైనే ఉన్నాయి. 'కార్తికేయ- 2' ఫేం చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుండగా.. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 07న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇంకా చదవండి: 'మిస్టర్ మాణిక్యం'గా సముద్రఖని ఫస్ట్ లుక్ & రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేసిన ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఏషియన్ సునీల్ నారంగ్

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# NC24     # నాగచైతన్య     # కార్తీక్ వర్మదండు    

trending

View More