నిఖిల్‌  'స్వయంభూ’ నుంచి నభానటేష్ స్టిల్‌ విడుదల!

నిఖిల్‌ 'స్వయంభూ’ నుంచి నభానటేష్ స్టిల్‌ విడుదల!

2 months ago | 26 Views

టాలీవుడ్‌ యువ కథానాయకుడు నిఖిల్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'స్వయంభూ’. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తుండగా.. 'ఠాగూర్‌' మధు సమర్పణలో పిక్సెల్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై భువన్‌, శ్రీకర్‌ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సంయుక్తా మీనన్‌ కథనాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం సంయుక్తా మీనన్‌ హార్స్‌ రైడింగ్  కూడా నేర్చుకుంటుంది. అయితే తాజాగా ఈ సినిమా సెట్‌లోకి మరో స్టార్‌ హీరోయిన్‌ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే నభా నటేష్‌ ఈ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తేలిసిందే. ఇక తాజాగా నభా నటేష్‌ 'స్వయంభూ’ సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్లు మేకర్స్‌ వెల్లడించారు.  ఈ సందర్భంగా నభా సెట్స్‌లోకి అడుగుపెట్టిన వీడియోను ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. 

కన్నడ నటి నభానటేష్‌  'నన్ను దోచుకుందువటే’ చిత్రంతో టాలీవుడ్‌కు  పరిచయమయ్యారు. రామ్‌పోతినేని హీరోగా నటించిన 'ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాతో విజయాన్ని అందుకున్నారు. 'సోలో బ్రతుకే సో బెటర్‌’, 'డిస్కో రాజా’ వంటి చిత్రాల్లో నటించిన ఆమె దాదాపు మూడేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'స్వయంభూ’చిత్రంలో మరో నాయికగా నభా నటేష్‌ పేరుని ఖరారు చేశారని వార్తలొచ్చాయి. ఆ వార్తలు నిజమేనంటూ తాజాగా సినిమాలో ఆమె లుక్‌కి సంబంధించిన వీడియోను విడుదల చేసిన చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. యుద్ధ నేపథ్య కథాంశంతో రూపొందుతోన్న ఈ యాక్షన్‌ డ్రామాలో నిఖిల్‌ ఓ యోధుడి పాత్రలో కనువిందు చేయనున్నారు.

ఇందుకోసం ఆయన మార్షల్‌ ఆర్ట్స్‌, గుర్రపు స్వారీ తదితర విద్యల్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. 'ఠాగూర్‌' మధు సమర్పణలో భువన్‌, శ్రీకర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్‌ సంగీతమందిస్తుండగా.. మనోజ్‌ పరమహంస ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. 'స్వయంభు' చిత్రానికి 'కేజీఎఫ్‌' ఫేం రవి బస్రూర్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఇంకా చదవండి: చిమటా ప్రొడక్షన్స్ "నేను-కీర్తన" ఫస్ట్ లుక్ & టీజర్ విడుదల!!

# Swayambhu     # Nikhil Siddhartha     # Samyuktha Menon     # Nabha Natesh