వచ్చే నెల పట్టాలకెక్కనున్న ఎన్టీఆర్‌ కొత్త సినిమా

వచ్చే నెల పట్టాలకెక్కనున్న ఎన్టీఆర్‌ కొత్త సినిమా

5 months ago | 63 Views

స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌, హీరో ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్నట్లు ప్రకటించి చాలా నెలలు అవుతోంది. అప్పటినుంచి దీనిపై ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడంతో అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది. ఈ సినిమా షూటింగ్‌ సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. మొదటి షెడ్యూల్‌ ఎన్టీఆర్‌ లేకుండానే ప్లాన్‌ చేస్తున్నారట. ప్రస్తుతం ఎన్టీఆర్‌ 'దేవర’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇది పూర్తికాగానే ప్రశాంత్‌నీల్‌ ప్రాజెక్ట్‌లో ఆయన జాయిన్‌ కానున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'దేవర’ సినిమా నుంచి రెండోపాట త్వరలోనే విడుదల కానుంది.


ఈనేపథ్యంలో నిర్మాత నాగవంశీ పెట్టిన పోస్ట్‌ ఎన్టీఆర్‌ అభిమానుల్లో జోష్‌ పెచ్చింది. 'అరవింద సమేత’లో ఎన్టీఆర్‌ పోస్టర్‌ను షేర్‌ చేసిన నాగవంశీ.. 'ఎన్టీఆర్‌ను ఇలా క్యూట్‌గా చూసి ఆరు సంవత్సరాలు అయింది. మళ్లీ ఇలా నవ్వుతూ రొమాన్స్‌ చేయడం చూస్తారు ఈసారి. మనకి అది సరిపోతుంది కదా’ అని రాసుకొచ్చారు. దీంతో 'దేవర’ నుంచి రొమాంటిక్‌ సాంగ్‌ రానుందేమోనని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు. సముద్రతీర ప్రాంతం నేపథ్యంలో రెండు భాగాలుగా 'దేవర’ తెరకెక్కుతోంది. తొలి భాగం సెప్టెంబరు 27న విడుదల కానుంది. జాన్వీ కపూర్‌ ఈ సినిమాతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందులో ఆమె లుక్‌ను విడుదల చేయగా.. దానికి మంచి స్పందన వచ్చింది. ఇందులో ప్రతినాయకుడి పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌, కీలక పాత్రలో శ్రీకాంత్‌ కనిపించనున్నారు.

ఇంకా చదవండి: యూనిక్ పాయింట్‌తో తీసిన ‘శివం భజే’ అందరికీ నచ్చుతుంది.. హీరో అశ్విన్ బాబు

# JrNTR     # HrithikRoshan     # PrashanthNeel    

related

View More
View More

trending

View More