'వార్-2లో విలన్‌గా ఎన్టీఆర్!
2 months ago | 5 Views
తారక్ లేటెస్ట్ ఫిల్మ్ 'దేవర’ హిట్టవ్వడంతో ఆయన మరింత జోష్‌లో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ 'ఎన్టీఆర్31'తో పాటు యశ్ రాజ్ ఫిల్మ్స్‌ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్ లోని 'వార్ 2' సినిమాలో పనిచేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో తారక్-హృతిక్ రోషన్‌కు మధ్యలో భారీ యాక్షన్ ప్యాక్‌డ్ సీక్వెన్సెస్ ప్లాన్ చేస్తున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్‌కి సంబంధించిన ఓ అప్డేట్ బయటకొచ్చింది.. స్పై యూనివర్స్‌లో భాగంగా నిర్మిస్తున్న ఈ ఫిల్మ్ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే సినిమా మేజర్ పోర్షన్ షూటింగ్ పూర్తయింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య జరగనున్న యాక్షన్ ప్యాక్‌డ్ క్లైమాక్స్ ఒక్కటి ఇంకా బాకీ ఉంది. దీంతో వచ్చే ఏడాది నవంబర్‌లో ఈ పార్ట్‌ని చిత్రీకరించడానికి సినీ యూనిట్ సిద్ధమైంది.
ప్రత్యేకమైన డైట్‌ని పాటిస్తూ ఇద్దరు హీరోలు కండలు తిరిగిన శరీరాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే వీరిద్దరి మధ్య 'హ్యాండ్ టూ హ్యాండ్’ ఫైట్ సీక్వెన్సెస్ కూడా ఉండనున్నాయట. 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ అవతారమెత్తిన తారక్‌కి ఇది బాలీవుడ్ డెబ్యూ కావడం విశేషం. అసాధారణమైన యాక్టింగ్, పవర్ ఫుల్ డైలాగ్ డిక్షన్, స్టైలిష్ డ్యాన్సులతో సకలవల్లభుడి గా తెలుగు ప్రేక్షకులకు మాత్రమే పరిమితమైన తారక్ ని బాలీవుడ్ తొలిసారి విట్ నెస్ చేయబోతుంది. డైరెక్టర్ ఆయాన్ ముఖర్జీ ఎన్టీఆర్‌ని ఎలా ఉపయోగించుకొన్నాడని సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా దర్శక నిర్మాత ఆదిత్యా చోప్రా ఇప్పటికే ఏక్తా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్ సినిమాలని ఇన్‌క్లూడ్ చేశాడు. ఫ్యూచర్‌లో టైగర్ 3, ఆల్ఫా, పఠాన్ 2, టైగర్ వర్సెస్ పఠాన్ చిత్రాలను ప్లాన్ చేస్తున్నాడు.
ఇంకా చదవండి: ఫీమేల్ లీడ్ రోల్‌గా సంయుక్త మూవీ