'డ్రాగన్‌'గా ఎన్టీఆర్‌..!

'డ్రాగన్‌'గా ఎన్టీఆర్‌..!

1 day ago | 5 Views

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా టైటిల్‌ను సంక్రాంతి సందర్భంగా వెల్లడించనున్నారని తెలిసింది. ఇప్పటికే ఈ సినిమాకు ‘డ్రాగన్‌’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్నది. చిత్ర బృందం కూడా ఇదే టైటిల్‌ను ఖరారు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్‌ సస్పెన్స్‌ వీడాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే. ఫిబ్రవరి లేదా మార్చిలో షూటింగ్‌ మొదలుకానుందని సమాచారం.  ఇందులో ఎన్టీఆర్‌ క్యారెక్టర్‌ పై కొన్ని ఆసక్తికరమైన విషయాలు వైరల్‌ అవుతున్నాయి. ఈ చిత్రంలో తారక్‌ నెగటివ్‌రోల్‌లో కనిపిస్తాడని సమాచారం.


డ్రాగన్‌ టైటిల్‌కి తగ్గట్టే ప్రశాంత్‌ నీల్‌ పాత్రను డిజైన్‌ చేశాడని టాక్‌. యూరోపియన్‌ కల్చర్‌లో చెడుకి సింబల్‌ డ్రాగన్‌. మైథాలజీలో ఓ రాక్షసుడు. డ్రాగన్‌కి అగ్గి పీల్చే గుణం వుంటుంది. అలాగే అలజడికి సింబాలిక్‌గా డ్రాగన్‌ ని వాడుతారు. ఇవన్నీ ఎన్టీఆర్‌ క్యారెక్టర్‌ లో ఉండేట్లు డిజైన్‌ చేస్తున్నారట డైరెక్టర్‌. టెంపర్‌ లో ఎలాగైతే ఎన్టీఆర్‌ పాత్ర ఉంటుందో..అదే తరహాలో ఈ మూవీ లో కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

ఇంకా చదవండి: తెలుగులో ‘పా.. పా..’గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ ‘డా..డా’

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# డ్రాగన్‌     # ఎన్టీఆర్‌     # ప్రశాంత్‌ నీల్‌